వరుడి ముందే పెళ్లి కూతురికి ముద్దుపెట్టిన ప్రియుడు.. పెళ్లిలో రచ్చ రచ్చ

పోలీస్ స్టేషన్‌కు పెళ్లి కూతురు ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ మరో మలుపు తిరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదని.. వంశీతోనే కలిసి ఉంటానని పోలీసులకు చెప్పింది.

news18-telugu
Updated: August 27, 2020, 11:31 AM IST
వరుడి ముందే పెళ్లి కూతురికి ముద్దుపెట్టిన ప్రియుడు.. పెళ్లిలో రచ్చ రచ్చ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనుకున్న ముహూర్తానికే ఘనంగా పెళ్లయింది. ఇరు కుటుంబాలు, బంధు మిత్రులు ధూమ్ ధామ్‌గా వేడుకను జరుపుకుంటున్నారు. బరాత్ తీసి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. డప్పుల మోతలు, తీన్‌మార్ డాన్స్‌లతో కొత్త జంటను ఊరేగిస్తున్నారు. అంతలోనే ఎవరూ ఊహించని ఘటన జరిగింది. బరాత్‌కు వచ్చిన పెళ్లికూతురు ప్రియుడు అక్కడ రచ్చ రచ్చ చేశాడు. వరుడు, బంధువులందరి ముందే పెళ్లి కూతురుకు ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో పెళ్లి కొడుకుతో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. సినిమా తలపించే ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్‌కు చెందిన దివ్య అనే యువతి వంశీ అనే యువకుడిని ప్రేమించింది. ఐతే ప్రేమా గీమ వద్దని.. తాము చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఇష్టం లేకున్నా పెళ్లి ఒప్పుకుంది దివ్య.

అంతా అనుకున్నట్లుగానే జరిగింది. పెళ్లి తంతు పూర్తయింది. ఐతే బరాత్‌లో అందరూ ఆటపాటలతో సందడి చేస్తున్న సమయంలో పెళ్లి కూతురు ప్రియుడు వంశీ ఎంటరవడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. పెళ్లికూతురు ఇంటి నుంచి నవ దంపతులు ఊరేగింపుగా వెళ్తుండగా కారును అడ్డుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న వంశీ.. దివ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరి ముందే తిట్టిపోశాడు. నన్ను కాదని ఎలా పెళ్లి చేసుకున్నావంటూ నిలదీశాడు. దివ్యను కారు నుంచి కిందకు దింపి వరుడి ముందే ఆమెకు ముద్దుపెట్టాడు. దివ్య ఎప్పటికీ నాదేనని.. ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ గొడవ చేశాడు. ఊహించని ఈ ట్విస్ట్‌తో పెళ్లి కుమారుడు ప్రవీణ్ షాక్ తిన్నాడు.

చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మద్యం మత్తులో వంశీ న్యూసెన్స్ చేయడంతో పాటు తనపై దాడికి యత్నించాడని పెళ్లి కొడుకు ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఐతే పోలీస్ స్టేషన్‌కు పెళ్లి కూతురు ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ మరో మలుపు తిరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదని.. వంశీతోనే కలిసి ఉంటానని పోలీసులకు చెప్పింది. దాంతో మళ్లీ ఖంగుతిన్నాడు వరుడు. పోలీసులు వధూవరులకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ రాజీకి రాలేదు. చివరకు వధువు దివ్యను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు వరుడు ప్రవీణ్. తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. తమ పరువు తీసిందని భావించిన వధువు తల్లిదండ్రులు.. దివ్యను పోలీస్ స్టేషన్‌లోనే వదిలిపెట్టి వెళ్లారు. ఒంటరిగా ఉన్న ఆమెను కరీంనగర్‌లోని స్వధార్ హోమ్‌కు తరలించారు.
Published by: Shiva Kumar Addula
First published: August 27, 2020, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading