Home /News /telangana /

Viral Video: పోలీసులకు చుక్కలు చూపించిన మహబూబ్ నగర్ బుడ్డోడు.. ఆటిట్యూడ్ మాములుగా లేదుగా..

Viral Video: పోలీసులకు చుక్కలు చూపించిన మహబూబ్ నగర్ బుడ్డోడు.. ఆటిట్యూడ్ మాములుగా లేదుగా..

ఆ బుడ్డోడిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు

ఆ బుడ్డోడిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు

Crazy Boy: ఈ బండి చిన్నపిల్లలది.. పక్కకు తప్పుకో.. నా దగ్గర గ్రీన్ కార్డు ఉంది.. అంటూ ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో చోటు చేసుకుంది. బుడ్డోడి ఆటిట్యూడ్ కి షాక్ అయిన పోలీస్ సిబ్బంది సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇవే..

ఇంకా చదవండి ...
    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఓ బుడ్డోడు పోలీసుల‌కే చుక్క‌లు చూపించాడు. ముఖానికి మాస్క్‌, త‌ల‌కు హెల్మెట్ లేకుండా ఓ మైన‌ర్ పిల్లాడు బండి న‌డుపుకుంటూ వెళ్ల‌డం అక్క‌డే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు గ‌మ‌నించాడు. లైసెన్స్ లేకుండా చిన్న పిల్ల‌లు బైక్ న‌డ‌పొద్ద‌ని ట్రాఫిక్ పోలీస్ చెప్ప‌గా.. ఇది ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్‌.. దీనికి లైసెన్స్ అక్క‌ర్లేదంటూ తెగ ఆటిట్యూడ్ చూపించేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇది చిన్న పిల్లల బండి..పక్కకు తప్పుకో..నా దగ్గర కార్డు ఉంది..అంటూ ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుడ్డోడుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. మైనర్ పిల్లాడు బండి ఆపుతూ వెళుతుండగా ట్రాఫిక్ పోలీసు ఆపగా..బుడ్డోడు చెబుతున్న సమాధానం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. చివరకు బుడ్డోడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంతరం ఈ విషయం పెద్దలకు తెలియచేసి..కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో యథావిధిగా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

    ఈ సమయంలో ఓ బండిపై ఓ మైనర్ పిల్లాడు వస్తున్న విషయం గమనించారు. ముఖానికి మాస్క్, హెల్మెట్ లేకపోవడంతో బాలుడిని ఆపారు. లైసెన్స్ లేకుండా పిల్లలు బండి నడపొద్దని తెలియదా ? అంటూ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించాడు. తన దగ్గర గ్రీన్ కార్డు ఉందని, ఇది ఎలక్ట్రిక్ వాహనం అని..లైసెన్స్ అవసరం లేదని చెప్పుకొచ్చాడు.



    వెంటనే బండిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి..వారి సమక్షంలో మైనర్ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదంతా అక్కడనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Mahabubnagar, Telangan traffic police, VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు