Home /News /telangana /

BOTH TELUGU STATES CM ARE IN MATCH FIXING DK AARUNA SAID VRY

DK Aruna on cm kcr : సీఎం కేసిఆర్, జగన్‌లు మ్యాచ్‌ఫిక్స్.. మంత్రుల మాటలన్ని నాటకాలే...!

డీకే అరుణ(ఫైల్ ఫొటో)

డీకే అరుణ(ఫైల్ ఫొటో)

DK Aruna on cm kcr : రెండు రాష్ట్రాల సీఎంలు ఎప్పుడే మ్యాచ్‌ఫిక్స్ చేసుకున్నారని, ప్రస్తుతం ఏపి కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలన్ని సీఎం కేసిఆర్ ఆడిస్తున్న డ్రామాలో భాగమని మాజి మంత్రి బిజెపి నేత డికే అరుణ విమర్శించారు.

ఇంకా చదవండి ...
ఏపి ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఒక డ్రామాగా కొట్టిపారేశారు బిజెపి నేత డీకే అరుణ.పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసేందుకే ఈ రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆమె ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ రానున్న ఎన్నికల్లో కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి ,అనంతరం ఆయన కేంద్రానికి వెళ్లి రాజకీయాలు చేయాలనే భవిష్యత్ ప్రణాళికలతోనే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలు నెలకొల్పెందుకు నాటకాలు అడుతున్నారని ఆమె విమర్శించారు. ముఖ్యంగా ఇద్దరి సీఎంల మధ్య మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆమె వివరించారు.

ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపట్టనున్న ఏప్రాజెక్టుపై సీఎం కేసిఆర్‌కు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. వెంటనే ఏపి చేపట్టిన ప్రాజెక్టులు అడ్డుకుని తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ఇప్పటికే సీఎం జగన్‌తో లోపాయికారి ఒప్పందాన్ని పక్కన బెట్టాలని అన్నారు.

ఇక ప్రతిపక్షాలు సీఎంను కలవడం అంతా హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటీ వాటికి శ్రీకారం చుడుతున్నారని మండిపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది ప్రతిపక్షనాయకులు ఇచ్చిన సలహాలను ఎన్ని అమల్లో పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఆయన ఏనాడు ప్రతిపక్షాలకు విలువ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు..ఈ హుజురాబాద్ ఎన్నికల కోసమే...ప్రతిపక్షాల నాటకమాడుతున్నారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లి వారి ముఖం కూడా చూడడని ఆమె అన్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: CM KCR, DK Aruna

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు