హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: ఆ ఇద్దరికీ బీజేపీ హైకమాండ్ పిలుపు..హుటాహుటీన ఢిల్లీకి పయనం..అమిత్ షాతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ

Big News: ఆ ఇద్దరికీ బీజేపీ హైకమాండ్ పిలుపు..హుటాహుటీన ఢిల్లీకి పయనం..అమిత్ షాతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ

ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి

ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. దీనితో వారు హుటాహుటీన ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో వీరు భేటీ కానున్నారు. తెలంగాణలో మోదీ (Modi) పర్యటించిన కొన్ని రోజులకే బీజేపీ హైకమాండ్ నుండి ఈటెల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి పిలుపు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ భేటీ వెనక ఉన్న అంతర్యార్ధం ఏంటో తెలియాల్సి ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. దీనితో వారు హుటాహుటీన ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో వీరు భేటీ కానున్నారు. తెలంగాణలో మోదీ (Modi) పర్యటించిన కొన్ని రోజులకే బీజేపీ హైకమాండ్ నుండి ఈటెల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి పిలుపు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా నిన్ననే డీకే అరుణ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తుంది.

Dalit Bandhu Scheme: దళితుల ఖాతాల్లో 10లక్షలు జమ .. దళితబంధు రెండో విడత నిధులు ఎప్పడు ఇస్తున్నారంటే..?

తెలంగాణాలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రచిస్తూ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్నారు. అయితే ఈటెల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  (Komati Reddy Rajagopal Reddy) భేటీలో అమిత్ షా రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈనెల 20 నుంచి బీజేపీ శిక్షణ తరగతులు జరగనున్నాయి. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా తరగతులు దోహదపడుతాయని భావిస్తున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కూడా పాదయాత్రను పున:ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మునుగోడు బైపోల్ (Munugodu By Election) సమయంలో ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి పాదయాత్ర ప్రారంభం, శిక్షణ తరగతులపై బండి సంజయ్ నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది ఆగష్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ తరువాత రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మునుగోడులో నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో రాజగోపాల్ రెడ్డి ఓటమి చెందారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి (Palwai Srvanti) పోటీ చేయగా డిపాజిట్ కూడా దక్కలేదు. మునుగోడులో గెలిచి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని ట్యాగ్ ను తీసుకెళదామనుకున్న బీజేపీకి షాక్ తగిలింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మునుగోడు (Munugodu)లో గెలిచి తీరుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.

First published:

Tags: Amit Shah, Etela rajender, Komatireddy rajagopal reddy, Pm modi, Telangana

ఉత్తమ కథలు