BOTH MOTHER AND BABY DIED AFTER THEIR FIRST DELIVERY AT A GOVERNMENT HOSPITAL IN MAHABUBNAGAR NNK NJ PRV
Sad Story: విధి ఆడిన వింత నాటకం.. తొలి కాన్పులోనే బిడ్డను పోగొట్టుకున్న తల్లి.. ఆ తర్వాత కొద్దిసేపటికే..
మృతురాలు జ్యోతీ
తొలి కాన్పులో బిడ్డను పోగోట్టుకొని పుట్టెడు దు:ఖంతో ఇంటికి వెళ్లిన కాసేపటికే మరోసారి విధి ఆమెను చిన్నచూపు చూసింది. నొప్పులకు తట్టుకోలేక పోయింది. ఇంతలో జరగరాని ఘోరం జరిగిపోయింది.
ఆ మహిళకు అసలే తొలి కాన్పు (First delivery) . గంపెడంత ఆశతో ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి వెళ్లింది. అయితే విధి ఆమెపై సీతకన్ను వేసిందేమో.. పురిట్లోనే పుట్టిన బిడ్డ మృత్యులోకాలకు వెళ్లిపోయింది. ఇక పుట్టెడు దు:ఖంతో ఇంటికి వెళ్లిన కాసేపటికే మరోసారి విధి ఆమెను చిన్నచూపు చూసింది. నొప్పులకు తట్టుకోలేక పోయింది. ఇంతలో జరగరాని ఘోరం జరిగిపోయింది.
మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన జ్యోతి 9 నెలలు నిండడంతో తొలి కాన్పు (First delivery) కోసం పాన్‌గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Center)లో చేరింది. నొప్పులు (Pains) సరిగా రావటం లేదని కాన్పు చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అలానే కాన్పు చేశారు పండంటి బాబు (Baby boy) పుట్టాడు. అయితే పసికందు పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి పంపించారు. కానీ ఆ జిల్లా ఆస్పత్రి (District Hospital)లో పసికందు కన్నుమూసింది (Baby died). త్వరలో తమ ఇంట్లో బోసినవ్వులు పూస్తాయని ఎదురుచూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కంటి నిండా కన్నీరుతో చనిపోయిన బాబును తీసుకొని బంధువులు కేతేపల్లి వచ్చి పూడ్చి పెట్టి ఇంటికి వచ్చారు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే జ్యోతి పరిస్థితి వారిని మరింత ఆందోళనకు గురిచేసింది.
ఎన్ని ఆస్పత్రులు తిప్పినా.. దక్కని ప్రాణం
జ్యోతి (Jyothi)కి అధిక రక్తస్రావం అవుతుండటంతో ఆమెను గోపాల్పేట రోడ్డులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడకు వెళ్లినా ఆమెకు రక్తస్రావం ఆగలేదు. రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో…అంబులెన్స్‌లో వనపర్తిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ జ్యోతికి రక్తం ఎక్కించినా పరిస్థితి అదుపు తప్పడంతో వైద్యులు మహబూబ్‌నగర్‌కు రిఫర్ చేశారు. కానీఅక్కడికి వెళ్లే వ్యవధి లేకపోవడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రి సిబ్బందితో సహా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడకు వెళ్లే సరికే పరిస్థితి చేయిదాటిపోయింది. జ్యోతి మరణించిందని పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. జ్యోతి మృతదేహాన్ని కేతేపల్లిలోని ఆమె ఇంటికి తరలించారు. ఒకేరోజు తల్లీబిడ్డల మరణంతో ఆ గ్రామంలో రోదనలు మిన్నంటాయి.
ఆదుకోవాలని డిమాండ్..
సీపీఐ (CPI) జిల్లా నాయకులు, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ (Kalavathamma) ఈ సంఘటనలపై స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు సురక్షితమని ప్రభుత్వం ఊదరగొట్టడం తప్ప… ఆస్పత్రుల్లో తగిన వసతులు లేవనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై మహిళలు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేదా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొన్నేళ్ల క్రితం కేతేపల్లికి చెందిన మరో మహిళ వనపర్తి ఏరియా ఆసుపత్రికి కాన్పుకు వచ్చి ప్రాణం కోల్పోయిన సంఘటనను గుర్తు చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.