హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం.. కారణమిదే..

తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం.. కారణమిదే..

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

పదుల సంఖ్యలో ఉన్న వీళ్లు గుంపుగా ఒకచోట పోగైన చోట.. చిత్రవిచిత్రమైన శబ్దాలు చేస్తూ.. పెద్దపెద్దగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోతుండడంతో చుట్టుపక్కల నివాసులు, వ్యాపార సముదాయాల వాళ్లు తలలు పట్టుకుంటున్నారు.

 • News18
 • Last Updated :

  రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిజ్రాల మధ్య సరిహద్దు వివాదం రగులుతోంది. ఎక్కడెక్కడ ఎవరెవరు వసూళ్లు చేసుకోవాలన్న దానిపై వారిలో వారికి రోజురోజుకూ తగవులు ముదురుతున్నాయి. ముఖ్యంగా నేషనల్‌ హైవేలు.. సరిహద్దు పట్టణాలలో పొరుగు రాష్ట్రం వాళ్ల రాక.. వసూళ్లపై ఇక్కడి హిజ్రాలు కన్నెర్ర చేస్తున్నారు. వారి రాకను అడ్డుకుంటున్నారు. ఫలితంగా నిత్యం సరిహద్దుల్లోని నేషనల్‌ హైవేలు, సమీప పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కూర్చోని మాట్లాడుకుందామంటూనే.. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతంలో నిత్యం ఎక్కడో ఒకచోట వీరి మధ్య రగడ నడుస్తునే ఉంది. పదుల సంఖ్యలో ఉన్న వీళ్లు గుంపుగా ఒకచోట పోగైన చోట.. చిత్రవిచిత్రమైన శబ్దాలు చేస్తూ.. పెద్దపెద్దగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోతుండడంతో చుట్టుపక్కల నివాసులు, వ్యాపార సముదాయాల వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ సరిహద్దు గీతలు గీసుకోవడంతో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

  వివాహాలు.. గృహ ప్రవేశాలు.. దుకాణ సముదాయాలు.. వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు మొదలు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వచ్చి చేతులు చాచడం.. తాము అడిగిన మేరకు ఇచ్చుకుంటేనే ఆశీర్వచనం అందుతుందని ఒక బెదిరింపుతో కూడిన స్వరంతో అడగడం.. ఇవ్వకపోతే చిత్రవిచిత్రమైన శబ్దాలు చేస్తూ అక్కడ అల్లరి చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఎంతోకొంత ఇచ్చుకుని పంపేయడం జరుగుతున్న సంగతే. అయితే వీరి పట్ల సమాజంలో ఉన్న సానుభూతి.. వీరి శృతిమించిన ప్రవర్తనతో కొన్నిసార్లు సంబంధిత బాధ్యులు తలలు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేషనల్‌ హైవేలలో ఆగిన లారీలు, ఇతర ప్రవేటు వాహనాల వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న విమర్శ ఉంది. చెక్‌పోస్టులకు దగ్గరలో గుమిగూడి వాహనాలకు అడ్డుగా నిల్చోవడం.. డబ్బు ఇస్తే సరి.. లేదంటే శాపనార్ధాలు పెట్టడం పరిపాటిగా మారింది. అయితే అందరూ అలా ఉండరని.. ఏ కొందరో చేస్తున్న తప్పులకు తామంతా నిందలు మోయాల్సి వస్తోందని హిజ్రాల నాయకులు చెబుతున్నారు.

  తాజాగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన హిజ్రాల మధ్య మరోసారి వివాదం ప్రారంభం అయింది. గత రెండురోజులుగా ఆంధ్రకు చెందిన కొంతమంది హిజ్రాలు దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో అడుక్కోడానికి వచ్చారు. గతంలో జరిగిన ఒప్పందానికి భిన్నంగా వ్యవహరించడం ఏంటని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారిని స్థానిక హిజ్రాలు అడ్డుకున్నారు. వివాహం లాంటి ఫంక్షన్లు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి ఆంధ్రకు చెందిన హిజ్రాలు తెలంగాణలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తద్వారా తమకు చెడ్డపేరు వస్తోందని వాపోతున్నారు.

  హిజ్రాల సంక్షేమ సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దోమల మేరీ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు 15 మంది గత కొద్దిరోజులుగా అశ్వారావుపేట, తదితర ప్రాంతాల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో ఉభయ రాష్ట్రాలకు చెందిన వారం కూర్చొని తెలంగాణ, ఆంధ్ర గా కమిటీలు విడిపోవడం తో పాటు, ఒకరి రాష్ట్రాములో మరొకరు జోక్యం చేసుకోవద్దన్న ఒప్పందం చేసుకున్నట్టు.. దానికి విరుద్ధం గా వ్యవహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని స్థానిక హిజ్రాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అశ్వారావుపేట పోలీస్ దృష్టికి తీసుకు వెళ్లామని.. ఆధార్ కార్డు ద్వారా ఆంధ్ర, తెలంగాణ గుర్తించ వచ్చన్నారు. ఆంధ్రకు చెందిన వారు అడ్డగోలుగా వ్యహరిస్తే తెలంగాణ హిజ్రాలు సహించరని మేరీ అన్నారు.మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ఆంధ్ర హిజ్రాల మధ్య సరిహద్దు వివాదంగా మారింది.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Andhra Pradesh, Khammam, Telangana, Transgender

  ఉత్తమ కథలు