హోమ్ /వార్తలు /తెలంగాణ /

Boora Narsaiah Goud: నేడు అమిత్ సమక్షంలో బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్.. టీఆర్‌ఎస్‌కు కష్టమేనా.?

Boora Narsaiah Goud: నేడు అమిత్ సమక్షంలో బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్.. టీఆర్‌ఎస్‌కు కష్టమేనా.?

బూర నర్సయ్య గౌద్ ( ఫైల్ ఫోటో)

బూర నర్సయ్య గౌద్ ( ఫైల్ ఫోటో)

Boora Narsaiah Goud: బూర నర్సయ్య గౌడ్ పార్టీ మార్పు ప్రభావం తమ గెలుపు అవకాశాలపై పడకుండా ఉండేందుకు.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలు, బూర నర్సయ్యతో సాన్నిహిత్యం ఉన్న ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు ఉపఎన్నికల (Munugode Bypoll) వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. గురువారం ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీ నేతలను కలిశారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్‌ (Tarun chugh)తో సమావేశమయ్యారు.ఈ భేటీతో బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరిక ఖాయమైంది. ఇవాళ హోంమంత్రి అమిత్ షాని కలిసి ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) రాజీనామా చేసిన తర్వాత.. ఉపఎన్నికల్లో తనకు టికెట్ వస్తుంని బూరనర్సయ్య గౌడ్  ఆశించారు.  ఆ నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకుడిగా పేరుండడంతో.. తనకే టికెట్ దక్కుతుందని భావించారు. కానీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆయన్ను పక్కనబెట్టి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బూర నర్సయ్య గౌడ్ కూడా చెప్పారు. బీఆర్ఎస్ (BRS) జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో తన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. ఆ తర్వాత అక్టోబరు 13 (గురువారం) కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. కానీ  ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ.. అదే రోజు ఢిల్లీకి వెళ్లారు. వ్యక్తిగత పనుల మీద ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి.. అక్కడ బీజేపీ నేతలను కలిశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా పనిచేసిన తనను.. ఇప్పుడు పార్టీ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితోనే.. బూర నర్సయ్య గౌడ్ పార్టీని వీడుతున్నట్లు ఆయన అనచరులు చెబుతున్నారు.

Munugodu: మంత్రి మల్లారెడ్డిపై మళ్లీ విమర్శలు .. మునుగోడు ప్రచారంలో ఆ విధంగా ప్రవర్తించడం తగునా..

తెలంగాణ ఉద్యమకారుడిగా, వృత్తిరీత్యా డాక్టర్‌గా, బలమైన బీసీ సామాజిక వర్గ నేతగా రాష్ట్రంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బూర నర్సయ్య గౌడ్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనను దూరం పెడుతున్నారని.. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు బూర నర్సయ్యగౌడ్. మునుగోడు ఉపఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారని తెలిసినా.. సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడలేదని తన అనచరులతో ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆత్మగౌరవం కోసం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట.

మునుగోడులో 60 శాతం ఓటర్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. మొత్తం 2.27 లక్షల మొత్తం ఓట్లలో గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే 37,144 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేత పార్టీని వీడుతున్నారని తెలిసిన వెంటనే.. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ప్రచార షెడ్యూల్‌ని పక్కనబెట్టి ప్రగతి భవన్‌కు వెళ్లివస్తున్నారు.బూర నర్సయ్య పార్టీని వీడుతున్నారన్న సమాచారం అందడంతోనే ఆయన్ను ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నట్లు సమాచారం. బూర నర్సయ్య గౌడ్  పార్టీ మార్పు ప్రభావం తమ గెలుపు అవకాశాలపై పడకుండా ఉండేందుకు.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలు, బూర నర్సయ్యతో సాన్నిహిత్యం ఉన్న ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.

First published:

Tags: Bjp, Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana, Trs

ఉత్తమ కథలు