BOOK YOUR DARSHAN TIME ONLINE IN TELANGANA TEMPLES BS
నేటి నుంచి ఆలయాల్లో ఆన్లైన్ సేవలు..
భద్రాద్రి ఆలయం(ఫైల్ ఫోటో)
భద్రాచలం, వరంగల్లోని భద్రకాళి, పెద్దమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించి ఆన్లైన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేడు ఈ సేవలను ప్రారంభించనున్నారు.
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు ఆన్లైన్ కానున్నాయి. ముందుగా భద్రాచలం, వరంగల్లోని భద్రకాళి, పెద్దమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించి ఆన్లైన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేడు ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి మంత్రి ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఇక, ఆయా ఆలయాల్లో ఆర్జిత సేవలు, గదుల్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. రోజువారీ పూజలు, ప్రత్యేక సేవలు, ప్రసాదం నిత్య కళ్యాణం, హోమాల సేవలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టీ యాప్ ఫోలియో ద్వారా కూడా ఈ బుక్ చేసుకోవచ్చు.
కాగా, గత ఏడాది తెలంగాణలో తొలిసారిగా సికింద్రాబాద్లో గణేష్ ఆలయంలో ఆన్లైన్ సేవలు ఆరంభమయ్యాయి. రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన దేవాలయంలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.