బోనం అంటే ఏంటి ... భాగ్యనగరానికి బోనాల సంస్క‌ృతి ఎలా వచ్చింది ?

నిజాం నవాబు కూడా బోనాలు అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చారు.

news18-telugu
Updated: July 21, 2019, 10:03 AM IST
బోనం అంటే ఏంటి ... భాగ్యనగరానికి బోనాల సంస్క‌ృతి ఎలా వచ్చింది ?
బోనాలతో వస్తున్న మహిళలు
news18-telugu
Updated: July 21, 2019, 10:03 AM IST
ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. ప్రతీఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. బోనం అనేది భోజనం అనే పదానికి వికృతి. మా బిడ్డల్ని , ఇంటి మనుషుల్ని మాత్రమే కాకుండా మొత్తం ఊరంతా చల్లగా చూడాలంటూ అమ్మవారికి భ‌క్తితో బోనం స‌మ‌ర్పిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ... పేరు ఏదైతేనేం... తమను చల్లగా చూడాలంటూ ఊరి ప్ర‌జ‌లు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ. తమ గ్రామానికి ఎలాంటి ఆపదా రాకుండా, తమ ఇంటికి ఏ కష్టమూ లేకుండా చూడాలని ఆ అమ్మతల్లిని తల్చుకుంటారు. మరి అలాంటి గ్రామదేవతలను ఘనంగా కొల్చుకునేందుకు ఓ సందర్భమే.. బోనాలు.

ఆషాఢమాసం రాగానే తెలంగాణ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకొంటారు. ఈ రోజున స్త్రీలు రాగి లేదా మట్టికుండలో అమ్మవారి కోసం వంట వండుతారు. చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారుచేస్తారు. బోనం ఉన్న కుండని పసుపుకుంకుమలతో అలంకరించి, వేపాకులు చుట్టి... దాని మీద జ్యోతిని వెలిగిస్తారు. ఇలా సిద్ధం చేసుకున్న బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి చేరుకున్న భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు.


బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం అందించడంతో ముగిసిపోదు. గ్రామీణసంబరాలకి సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాన్ని సమర్పిస్తారు. రంగం పేరుతో అవివాహితులు భవిష్యవాణిని చెప్పే ఆచారమూ ఈ జాతరలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆఘటాన్ని నిమజ్జనం చేయడం జ‌రుగుతుంది.



భాగ్యనగర బోనాల సంస్క‌ృతి:
హైదరాబాద్ లో బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. 1869లో జంటనగరాల్లో మలేరియా ప్రబలడంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. అమ్మవారికి ఆగ్రహం వచ్చిందని భావించిన జనం ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు బోనాల జాతర నిర్వహించారు. తర్వాత నిజాం కూడా బోనాలు అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చారు. అలా బోనాల సంస్కృతి నిజాం కాలం నుంచి హైటెక్ యుగం వరకు కొనసాగుతూ వచ్చింది. హైదరాబాద్ లో బోనాలు ప్రారంభమైయ్యేది, ముగిసేది గోల్కొండ కోట మీద ఉన్న జగదాంబిక ఆలయంలోనే. గోల్కొండ కోట మీద బోనాలు ప్రారంభం అయిన తర్వాతే తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతాయి. బోనాల పండగ వస్తుందంటే చాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవారు సైతం నగరానికి చేరుకుంటారు. గోల్కొండ ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి... ఇలా నగరంలోని ప్రతి కూడలిలోనూ జరిగే బోనాలు భాగ్య‌న‌గ‌రానికే... ప్ర‌త్యేక‌త తీసుకువ‌స్తాయి.
First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...