(K.Lenin,News18,Adilabad)
ఆషాడం మాసం ఆపై ఆదివారంSunday కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్Adilabad జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ ఏకమై బోనమెత్తాయి. ఎక్కడ చూసినా భక్తులు బోనం కుండలతో ఆలయాల ముందులు బారులు తీరారు. నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలతో ఇంటికే పరిమితమైన ఆడపడుచులు ఆషాడమాసం అందులో ఆదివారం కావడంతో బోనాలు సమర్పించుకునేందుకు కాలు బయటపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, పల్లెల్లో బోనాల సందడి(Bonala festival) కనిపించింది.
ఆషాడంలో బోనాల శోభ..
ఆషాడం బోనాల పండుగ కావడంతో ఒకరోజు ముందు నుండే పండుగ సామాగ్రి కొనుగోళ్లతో ప్రధాన వాణిజ్య కూడళ్లలో సందడి నెలకొంది. ఆదివారం కావడంతో ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ తదితర దేవతలకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నెత్తిన బోనం కుండలు, చేతిలో వేప కొమ్మలు ముందు భాగంలో డప్పుల భాజాల మధ్య పోతరాజుల విన్యాసాలతో ఊరుకు ఊరే కదిలి గ్రామ శివారులోని ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్ళి బోనాలు సమర్పించారు. కొన్నిచోట్ల సామూహికంగా బోనాలు సమర్పిస్తే, మరికొన్ని చోట్ల వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక..
ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టినట్లుగా కనిపిస్తాయి. ముఖ్యంగా జిల్లాలోని తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఆషాడ మాసంలో అకాడీ బోనాలు సమర్పించుకున్నారు. అయితే తమ గ్రామానికి చెందిన ప్రతి ఆడపడుచు ఎక్కడున్నా ఈ ఆషాడంలో స్వగ్రామానికి వచ్చి గ్రామ దేవతకు బోనం సమర్పించుకుంటారని గ్రామ సర్పంచ్ మహేందర్ యాదవ్ తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సుంకిడి గ్రామంలోని ఆడపడుచులు గ్రామదేవతకు పెద్దఎత్తున నైవేద్యాలు సమర్పించారు.
ఊరూరా బోనమెత్తారు..
నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలం అడెల్లిలోని పోచమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఈ గ్రామంలో ప్రతి ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బోనాలు సమర్పించారు. అటు మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలంలోని క్వారీలోని దుర్గాదేవి జాతరలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాలని అలాగే ముంపు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని క్వారీలోని దుర్గామాతను కోరినట్లు తెలిపారు మంచిర్యాల ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. అటు కొమురంభిం ఆసిఫాబాద్ జిల్లాలోనూ బోనాల పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Telangana Bonalu