BOINPALLI VINODKUMAR COUNTER TO YS SHARMILA ON RYTHUBHEMA VRY
Hyderabad : బీమా వయస్సు 60 ఏళ్లని మీకు తెలియదా.. షర్మిలకు కౌంటర్...
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
Hyderabad : రైతు బీమాపై విమర్శలు చేసిన వైఎస్ షర్మిలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.. ఆమె తెలుసుకుని మాట్లాడలంటూ.. చురకలంటించారు.
రైతు బీమా అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ షర్మిల విమర్శలు చేయడంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రివర్స్ కౌంటర్ వేశారు. ఆమె విషయాలు తెలుసుకుని మాట్లాడలని హితవు పలికారు. అవగాహాన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడలని కోరారు.
రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి రైతు భీమాను అమలు చేస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని ఆయన అన్నారు. కేంద్రం, పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇన్సూరెన్స్ సహా వివిధ పథకాలు 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయని, ఈ విషయం మీకు తెలియదా..? అని వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. వాస్తవాలేవీ తెలియకుండా షర్మిల తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు.
కాగా రైతు భీమాపై ప్రభుత్వం విధానాన్ని వైఎస్ షర్మిల విమర్శించారు. తనకు నచ్చిన అధికారులకు 65 సంవత్సరాల వరకు పొడగించిన సీఎం రైతు బీమాకు మాత్రం 59 సంవత్సరాల పరిమితిని విధించిడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీని వెనక ఉన్న లాజిక్ ఎంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 59 సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేసే వారు రైతులు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే బీమా రైతులకా వారి వయసుకా అంటూ నిలదీశారు. బీమా దక్కాలంటే రైతులు 59 సంవత్సరాలకే చనిపోవాలా అంటూ ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.