BOG JOLT TO KCR PARTY BADANGPET MAYOR PARIJATA NARSIMHA REDDY RESIGNS TO TRS SHE LIKELY TO JOIN CONGRESS SK
Mayor Resign to TRS: మోదీ సభ వేళ టీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మేయర్
ప్రతీకాత్మక చిత్రం
Mayor resign to TRS: గులాబీ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి (Parijatha narshimha Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి (Manchireddy Kishan Reddy)కి పంపించారు.
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National Executive Meeting) జరుగుతున్న వేళ.. అధికార పార్టీ టీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకి బడంగ్పేట్ (Badangpet) మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి (Parijatha narshimha Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి (Manchireddy Kishan Reddy)కి పంపించారు. పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతోనే సేవలందించామని పారిజాత పేర్కొన్నారు. ఐతే గడిచిన కొంతకాలంగా తన పట్ల వ్యతిరేక భావనతో ఉండడంతోనే, తాము ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టీఆర్ఎస్కు రాజీనామా చేసిన పారిజాత.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మహేశ్వరంలోని నాయకులందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. తాను ఎంత కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని కొన్నాళ్లుగా అసంతృప్తిలో ఉన్నారు పారిజాత. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్లు పారిజాత అనుచరులు వెల్లడించారు. ఈమె రెండేళ్ల పాటు టీఆర్ఎస్లో కొనసాగారు. పారిజాత రాజీనామా వ్యవహారం గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, రెండు రోజుల క్రితం బీజేపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలసిందే. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ (Banothu Sujatha Naik), రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్ (Archana Prakash), జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్ (Derangula Venkatesh), అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్ (Sunitha Prakash Goud), గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్ (Sindhuja Goud), కౌన్సిలర్ అసిఫ్ కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇది జరిగిన రెండు రోజులకే టీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఏకంగా బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌కు జైకొట్టారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.