హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda : హమ్మయ్య.. మొండెం దొరికింది.. రంగారెడ్డి జిల్లాలో మొండెం, నల్గొండ జిల్లాలో తల

Nalgonda : హమ్మయ్య.. మొండెం దొరికింది.. రంగారెడ్డి జిల్లాలో మొండెం, నల్గొండ జిల్లాలో తల

Nalgonda : మొండెం దొరికింది..

Nalgonda : మొండెం దొరికింది..

Nalgonda : నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెం లేని తల కేసులో మిస్సైన మొండెం ఎట్టకేలకు లభించింది. వందల మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి మూడు రోజులుగా వెతుకుతుండడంతో నేడు ఆ మొండెం లభించింది.

నల్గొండ జిల్లా సంచలనం సృష్టించిన జైహింద్ నాయక్ అనే మతిస్థిమితం లేని వ్యక్తినిని హత్య చేసి తల మొండెం వేరు చేశారు. తలను జిల్లాలోని చింతపల్లి మండలం నాగార్జున సాగర్ ,హైదరాబాద్ జాతీయ రహదారీ సమీపంలోని విరాట్‌నగర్ కాలనీలోని మెట్టు మహాంకాళీ ఆలయం అమ్మవారి వద్ద మొండెల లేని తలను పెట్టారు. కాగా ఈ విషయం సంచలనంగా మారింది. ముందుగా మొండెం తల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ఆలయం చుట్టు ఎలాంటీ సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసును చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. మొత్తం 70 మంది పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి మొండెం ఆచూకి కోసం వెతికారు.. కాగా మూడు రోజుల క్రితం లభించిన తలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్ర పరిచారు. ఈ క్రమంలోనే పోలీసు బృందాలు మొండెం ఆచూకి కోసం వెతుకున్నా నేటి సాయంత్రం వరకు ఆచూకి లభించలేదు..

అయితే తల లేని మొండెం కోసం తుర్కయాంజల్ ప్రాంతలోని వందల కిలోమీటర్ల వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరీశీలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే చివరకు మొండెం మాత్రం మరో జిల్లాలో లభ్యమయింది. తల నల్గొండ జిల్లాలో లభ్యం కాగా మొండెం మాత్రం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఓ భవనంపై జైహింద్ నాయక్ మొండెం లభించింది. కాగా జైహింద్ నాయక్ గత కొన్ని రోజులుగా తుర్కయాంజల్‌లోనే ఉంటున్నాడు.. దీంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని పోలీసులు ఆరా తీశారు. తీరా ఆ ప్రాంతంలోనే మొండెం లభించింది.

TS Politics : లాలుకు పట్టిన గతే కేసీఆర్‌కు ..! జైలు అనుభవం కోసమే తేజస్వీయాదవ్ తో భేటి..

అయితే ఇలా ఎందుకు ఎవరు చేశారు. కావాలనే హత్య చేశారా లేక మూఢనమ్మకాల మాయలో హత్య జరిగిందా అనేది తేలాల్సి ఉంది. కాగా జైహింద్ నాయక్‌కు మతి స్థిమితం సరిగా లేకపోవడం ఆయన ఎవరితో ఎప్పుడు చివరి సారిగా మాట్లాడని తేలకపోవడంతో పాటు మృతుడు సెల్ ఫోన్ కూడా వాడకపోవడం లాంటీ సమస్యలు పోలీసులకు కేసును చేధించేందుకు సవాల్‌గా మారింది. మొత్తం మీద మొండెం లభించడంతో పోస్టుమార్టంకు పింపించిన అనంతరం అసలు కారణాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు.

First published:

Tags: Crime, Nalgonda, Telangana

ఉత్తమ కథలు