BODILESS HEAD BEFORE GODDESS TEMPLE IN NALGONDA DISTRICT VRY
Nalgonda : వీళ్లకేమైనా పిచ్చా..! ఒకడు సమాధి తవ్వితే.. మరోకడు తలను వేరు చేసి ఆలయం వద్ద పెట్టాడు..?
Nalgonda : తెలంగాణలో మూఢనమ్మకాల సంస్కృతి ఇటివల వికృత రూపం దాల్చుతోంది. ఒకచోట మూడు సంవత్సరాల క్రితం పాతిపెట్టిన శవాన్ని వెలికి తీసి పుర్రెను తీసుకువెళితే.. మరోచోట ఏకంగా మనిషి నరికి తలమెండెం వేరు చేశారు. ఆ తర్వాత తలను అమ్మవారి గుడి ముందు పెట్టారు.
Nalgonda : తెలంగాణలో మూఢనమ్మకాల సంస్కృతి ఇటివల వికృత రూపం దాల్చుతోంది. ఒకచోట మూడు సంవత్సరాల క్రితం పాతిపెట్టిన శవాన్ని వెలికి తీసి పుర్రెను తీసుకువెళితే.. మరోచోట ఏకంగా మనిషి నరికి తలమెండెం వేరు చేశారు. ఆ తర్వాత తలను అమ్మవారి గుడి ముందు పెట్టారు.
ఇటివల ఒళ్లు గగుర్పాటుకు గురయ్యె రెండు క్రూరమైన సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. దీంతో మూఢనమ్మకాల ప్రభావం మరింత ప్రభలుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.. ఆధునిక సమాజం వైపు జనమంతా పరుగులు తీస్తుంటే.. అదే స్థాయిలో భక్తి, మూఢనమ్మకాల మాయలో పడి కొంతమంది దారుణాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే జుగుప్సాకరమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా నల్గొండ జిల్లాలో మరోదారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆ తర్వాత దారుణంగా ప్రవర్తించారు. తల ,మొండెం వేరు చేసి విరాట్నగర్లోని ఇటివల నిర్మించిన మహంకాళి గుడి వద్ద పెట్టారు. దీంతో గుడికి చేరుకున్న గ్రామస్థులు తలను చూసి భయబ్రాంతులకు గురయ్యారు. మొండెం లేని తలను చూసి పరుగులు పెట్టారు.. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఎలాంటీ ఆధారాలు లభించకపోవడంతో పాటు గుడి చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాల లేవని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. సాధారణ హత్యా, లేదంటే మూఢనమ్మకాలతో అమ్మవారి గుడి ముందు తలను పెట్టారా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు గత రెండు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగుల దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాధిని తవ్వి మహిళ పుర్రెను దొంగిలించారు.
రాయికోడ్ మండలం మహాభాత్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మృతి చెందగా, వారి గ్రామ శివారులో గల పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. అయితే.. గత గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సమాధి తవ్వారు... సమాధిలోని కాళ్లు చేతులు తల పుర్రె ఎముకలను తీసుకు వెళ్లారు. కాగా ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు,గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమాధిని పరిశీలించారు. అయితే సమాధిని తవ్విన దుండగులు ప్రోఫెషనల్స్ వలే వ్వవహరించారు. తమ ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకోసం సమాధి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కారంపొడి చల్లి వెళ్లారు. . కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా సమాధి తవ్వి పుర్రెను ఎందుకు తీసుకువెళ్లారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.