Home /News /telangana /

BODHAN MUNICIPALITY OFFICIALS FINED GOAT OWNER FOR PLANTING GREENERY VB NZB

Harithaharam: హరితహారం మొక్కలు మేసిన మేకలు.. బంధించిన అధికారులు.. ఎంత జరిమానా విధించారో తెలుసా..

హరితహారం మొక్కలను మేసిన మేక

హరితహారం మొక్కలను మేసిన మేక

Harithaharam: హరితహారం మొక్కలను మేకలు మేసినందుకు మున్సిపాలిటీ అధికారులు వాటిని బంధించారు. యజమాని వచ్చి జరిమానా కట్టి వాటిని విడిపించుకొని తీసుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచుసుకుంది.

    తెలంగాణ ప్ర‌భుత్వం హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. మొక్కల పెంపకానికి అనేక చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం కోట్ల మొక్క‌లు నాటుతుంది. ఆడ‌వులు పెంచండి.. కోతుల‌ను అడ‌వులకు పంపండి అనే నినాదాంతో సీఎం కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అయితే సీఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా మొక్క‌ల సంర‌క్ష‌ణ‌లో నిజామాబాద్ జిల్లా అధికారులు సైతం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హ‌రిత హారంలో నాటిన మొక్క‌ల‌ను మేసిన మేక‌ల‌కు జరిమానా విధించారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ఆవరణలో హరితహారం లో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టారు. అయితే మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న మొక్కలను మూడు మేకలు మేశాయి. ఇది గమనించిన మున్సిపల్ కమిషనర్ రాజలింగం మేకలను బంధించాలని సిబ్బందికి సూచించారు.

    మేక‌ల య‌జ‌మాని తస్లిమ్ బేగం కు స‌మాచారం అందించారు.. దీంతో విష‌యం తెలిసిన‌ యజమాని మున్సిఫల్ కార్య‌ల‌యానికి వ‌చ్చారు.. మున్సిప‌ల్ కార్య‌ల‌యంలోని మెక్క‌ల‌ను మీకు సంబంధిచిన మేక‌లు మేశాయి. దీంతో వాటికి ఒకొక్క మేక‌కు 5వంద‌ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తున్నామ‌ని క‌మిష‌నర్ తెలిపారు. దీంతో చేసేదేమి లేక మేక‌ల య‌జ‌మాని త‌స్లిమ బేగం జరిమానా క‌ట్టి త‌న మేక‌ల‌ను విడిపించుకుని వెళ్లింది.

    జరిమానా విధిస్తూ రశీదును యజమానికి అందజేస్తున్న అధికారి


    ఇలా మ‌రో సారి జ‌రిగితే పెద్ద మొత్తంలో జ‌రిమానా విధిస్థామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. హరితహారం మొక్కల సంరక్షణ కు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత తీసుకోవాలని కమిషనర్ కోరారు. హరితహారం మొక్కలు ధ్వంసం చేసినా.. వాటిని నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Fine, Fine for goats, Haritha haram, Nizamabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు