ప్రాణహిత నదిలో పడవ బోల్తా... ఇద్దరు ఆఫీసర్లు గల్లంతు

గల్లంతైన వారు బాలకృష్ణ, సురేష్‌గా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.


Updated: December 1, 2019, 2:23 PM IST
ప్రాణహిత నదిలో పడవ బోల్తా... ఇద్దరు ఆఫీసర్లు గల్లంతు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. దీంతో  ఫారెస్ట్  బీట్ ఆఫీసర్లు ఇద్దరు గల్లంతయ్యారు.  గల్లంతైన వారు బాలకృష్ణ, సురేష్‌గా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మహారాష్ట్రలోని హాహిరి నుంచి గూడెంకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మరో నలుగురు అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>