Home /News /telangana /

BLIND WOMAN GETTING PROBLEMS AND LOSS PENSION WITH OFFICERS MAKE MISTAKES AS SHE WAS DIED IN RECORDS HSN MBNR

నేను బతికే ఉన్నాను మహాప్రభో.. నా పెన్షన్ నాకు ఇప్పించండి.. అధికారుల నిర్లక్ష్యంతో ఓ అంధురాలికి కొండంత కష్టం..!

సారూ.. నేను బతికే ఉన్నాను. నా పెన్షన్ నాకు ఇప్పించండి మహాప్రభో అంటూ ఆ అంధురాలు ప్రతీ అధికారి వద్దకు వెళ్లి వేడుకోవాల్సి వస్తోంది. అధికారులు చేసిన ఒక్క పొరపాటుతో ఆమెకు కొండంత కష్టం వచ్చి పడింది..

  అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అంధురాలకి కొండంత కష్టం వచ్చింది. నేను బతికే ఉన్నాను సారూ.. అంటూ ప్రతీ అధికారి వద్దకు వెళ్లి నిరూపించుకోవాల్సి వస్తోంది. వికలాంగులు కింద పెన్షన్ తీసుకునే ఆ యువతి ప్రభుత్వ దృష్టిలో చనిపోయిందని సర్టిఫై చేశారు. ఇంకేముంది ఆ అభాగ్యురాలికి ప్రతీ నెలా వచ్చే పెన్షన్ ఆగిపోయింది. అంధురాలు అయినా చదువులో ఆమె సరస్వతి బిడ్డ. జాతీయస్థాయిలో కూచిపూడి, భరతనాట్యంలో మంచి గుర్తింపు పొందింది. రాష్ట్రపతి అవార్డు కూడా పొందింది. బతికి ఉండగానే అధికారులు తనను చనిపోయినట్టు రికార్డులకు ఎక్కించడంతో ఆ యువతి మనోవేదనకు గురవుతోంది. తాను చనిపోలేదనీ, తన పెన్షన్ తనకు ఇప్పించమని ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  జోగులమ్మ గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన నాగమణి అనే యువతి ఓ అంధురాలు. పుట్టుకతోనే అంధురాలు కావడంతో చదువంతా అంధుల ఆశ్రమ పాఠశాలలో కొనసాగింది. ఆమె తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. అంధురాలైన చదువులో సరస్వతి బిడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి మళ్లీ పొలిటికల్ సైన్స్ చదువుతోంది. అదనంగా ఈ సరస్వతి బిడ్డకు మరో కళ లో కూడా ప్రావీణ్యం ఉంది. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. గద్వాల్ లోని అంథుల పాఠశాలలో చదువుతున్నప్పుడే కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలాశ్రీ రాష్ట్రపతి అవార్డు తో పాటు వికలాంగుల సాధికారత అవార్డు, రాష్ట్రస్థాయి బాలల అవార్డు కూడా సాధించుకుంది. వీటితో పాటు 2016 సంవత్సరంలో అమెరికాలోని చికాగో రాష్ట్రంలో తానా ఉత్సవాలతో తన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

  2014 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు వికలాంగుల పెన్షన్ ఇస్తోంది. అప్పట్లో ఆ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న యువతికి అప్పుడు అధికారులు చుక్కలు చూపించారు కూడా. వికలాంగుల కింద పెన్షన్ కు దరఖాస్తు చేసుకుంటే వితంతువు కింద పెన్షన్ మంజూరు చేశారు. ఇదేంటని నిలదీస్తే ఆ తర్వాత తమ తప్పును సరిదిద్దుకున్నారు. మళ్లీ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయింది. రెండేళ్ల కిందటే నాగరాణి చనిపోయిందంటూ అధికారులు తమ పత్రాల్లో రాసుకున్నారు. ఆమెకు పెన్షన్ ను కూడా నిలిపివేశారు.

  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

  ప్రతీనెలా వచ్చే పెన్షన్ ఎందుకు ఆగిపోయిందా అని అధికారులను ఆరా తీస్తే చనిపోయినట్టు తమ రికార్డుల్లో ఉందని చావు కబురు చల్లగా చెప్పారు. తాను చచ్చిపోలేదు మహాప్రభో.. బతికే ఉన్నానంటూ గత రెండేళ్ల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తన కుటుంబం నిరుపేద కుటుంబం అని పెన్షన్ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని వాపోతోంది. చదువుకుంటున్న తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటోంది. ఆమె కష్టం తెలిసి గ్రామస్తులు వాపోయారు. ఎంతో ప్రతిభ కనబరుస్తున్న ఈ అభాగ్యురాలుకి వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అధికారులే ఇలా చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పును తెలుసుకుని ఇప్పటికైనా ఈ అభాగ్యురాలికి పెన్షన్ మంజూరు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

  పెన్షన్ ఆగిపోయిన మాట వాస్తవమే: ఎంపిడివో ఆయిజ సాయి ప్రకాష్..
  పెన్షన్ అగి పోయిన మాట వాస్తవమేనీ, పొరపాటున రికార్డులో చనిపోయినట్లు వచ్చిందని ఎంపీడీవో అయిజ సాయి ప్రకాశ్ తెలిపారు. మళ్లీ పెన్షన్ పునరుద్ధరణకు పంపించామని త్వరలోనే ఆమెకు పింఛన్ వస్తుందని ఆయన తెలిపారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Hyderabad, Mahabubnagar, Telangana

  తదుపరి వార్తలు