Singareni Accident: సింగరేణి గనిలో పేలుడు.. ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు

ప్రతీకాత్మక చిత్రం

Singareni Blast Accident: సింగరేణిలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఒకరు చనిపోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

  • Share this:
    Singareni Accident News: సింగరేణిలో బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బి గనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు పెడుతుంటారు. ఈ క్రమంలోనే కేబుల్‌వైర్‌ కనెక్షన్‌ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్‌ మిస్‌ ఫైర్‌ అయింది. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సింగరేణి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రత్నం, లింగయ్య, రాజం, సుమన్‌, శ్రీకాంత్‌గా గుర్తించారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో రత్నం అనేక కార్మికుడు చనిపోయాడు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ తరలించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: