హోమ్ /వార్తలు /తెలంగాణ /

Blast In IDA Bollaram: ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు..

Blast In IDA Bollaram: ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. బొల్లారం పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది.

  సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. బొల్లారం పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికులు మృతి చెందింది. ఈ పేలుడు కారణంగా మరో ఆరుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు బీటలు వారినట్టు కార్మికులు తెలిపారు. భారీగా శబ్దం రావడంతో భయాందోళన చెందినట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతిచెందిన కార్మికురాలిని రాధికగా గుర్తించారు.

  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐడీఏ బొల్లారం పోలీసులు తెలిపారు. ఇక, పరిశ్రమలోని కాయల్స్‌ వేడి చేసే బ్లాక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: BLAST, Sangareddy

  ఉత్తమ కథలు