Black Fungus: తెలంగాణలో కొత్త టెన్షన్.. బ్లాక్ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఒకరు మృతి

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రకు పక్కనే నిర్మల్ జిల్లా ఉండడం.. ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

  • Share this:
    ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్‌తో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది చాలదన్నట్లు ఇఫ్పుడు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) కూడా వచ్చేసింది.  మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్నాటకతో పాటు తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.  అంతేకాదు ఈ వ్యాధితో ఇప్పటికే ఒకరు మరణించార. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలోని గణేష్‌నగర్‌కు చెందిన తోట లింగురామ్ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో మరణించారు. మృతుడికి మధుమేహంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇటీవలే కరోనా కూడా సోకింది. చికిత్స అనంతరం కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ముక్కు, కళ్ల నుంచి ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించిందని.. ఈక్రమంలోనే పరిస్థితి విషమించింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు.

    కొన్ని రోజులుగా భైంసాకు చెందిన మరో వ్యక్తి కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారంలోపే ఆయనలో షుగర్ లెవెల్స్ భారీగా పెరిగాయి. ఒక కన్ను పూర్తిగా మూసుకుపోయింది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం మృతి చెందాడు. నిర్మల్‌ జిల్లాకే చెందిన మరో ఐదుగురు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందులో కుబీర్ మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయి. 2వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. మహారాష్ట్రకు పక్కనే నిర్మల్ జిల్లా ఉండడం.. ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

    ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులు బ్లాక్ ఫంగస్ కేసులను గాంధీ ఆసుపత్రికి పంపుతామని అడుగుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయనడంలో వాస్తవం లేదని రమేశ్ రెడ్డి అన్నారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని ఆయన వివరించారు. హైడోస్ స్టెరాయిడ్స్ వాడే కొందరిలో మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దని ఆయన సూచించారు. కేవలం కొందరికి మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సరైన చికిత్స అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని రమేశ్ రెడ్డి తెలిపారు.

    ఇది కూడా చదవండి:

    Black Fungus: కరోనా బాధితుల్లో బ్లాక్ ఫంగస్.. ఇది ప్రాణాంతకమా? లక్షణాలేంటి?
    Published by:Shiva Kumar Addula
    First published: