Black Fungus: హడలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్.. దవడ, కన్ను తొలగించినా దక్కని ప్రాణం.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Black Fungus: కరోనా బారిన పడిన వారు దేవుడి దయ వల్ల బతికి బట్ట కాట్టామనే లోపే బ్లాక్ ఫంగస్ వారి జీవితాలతో ఆడుకుంటోంది. తెలంగాణలో చాప కింద నీరులా బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది. దీని వల్ల కామారెడ్డి జిల్లాలో ఒకరు చనిపోయారు.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడకుండా ప్రభుత్వం లాక్ డౌన్ కూడా విధించింది. అయితే కరోనా బారి నుంచి బయటపడిన కొందరికి కొత్త రోగం భయాందోళనకు గురిచేస్తోంది. కొత్తగా బ్లాక్ ఫంగస్ సోకుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఒకరు చనిపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన 42సంవత్సరాల గురజాల అంజల్ రెడ్డి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. గత నెల 22న జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అంజల్ రెడ్డి అడ్మిట్ అయ్యాడు. కరోనా నిర్ధరణ పరిక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ నెల 23వ తేదీన నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అంజల్ రెడ్డి ని చేర్పించి చికిత్స అందించారు.

    నిజామాబాద్ ఆస్పత్రిలోనే 12 రోజుల పాటు చికిత్స పొందాడు. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిలించారు . బ్లాక్ ఫంగస్ కారణంగా ఈనెల 11వ తేదీన అంజల్ రెడ్డికి సంబంధించిన దవడ, కన్ను ను వైద్యులు తొలగించారు. దీంతో అంజల్ రెడ్డి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో బ్లాక్ ఫంగస్ కేసు నమోదు..
    చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య కి బ్లాక్ ఫంగస్ సోకింది. 20 రోజుల క్రితం అతడికి కరోనా రాగ .. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం 10 రోజుల నుండి ఇంటి దగ్గర ఉంటున్నాడు. 2 రోజులుగా ముఖం, మెడలు ఉబ్బడంతో కరీంనగర్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే బ్లాక్ ఫంగస్ గా గుర్తించిన వైద్యులు హైదరాబాద్ తరలించారు.
    Published by:Veera Babu
    First published: