Black Fungus in Telangana: హడలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్.. ఆ జిల్లాలో కొత్తగా కేసు నమోదు..

ప్రతీకాత్మక చిత్రం

Black Fungus: కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుంది. ఇప్ప‌టికే దేశంలో ప‌లు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ తెలంగాణ‌లోనూ హ‌డ‌లెత్తిస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా ఒక కేసు నమోదయ్యింది.

  • Share this:
    ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌లువురికి బ్లాక్ ఫంగ‌స్ సోక‌గా.. ఖమ్మం జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసు న‌మోదైంద‌ని తెలిపారు డాక్ట‌ర్లు తెలిపారు. మధిర నియోజకవర్గంలోని.. నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయ‌ని ఖ‌మ్మం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు తెలిపారు.
    ఇతను జనగామ జిల్లా మొండ్రాయి గ్రామం కొనకొండ్ల మండలంలో నివాసం ఉంటున్నాడు. గత 15 రోజుల క్రితం జ్వరం విపరీతంగా రావడంతో ఇతను అక్కడ నుండి మే10 వ తేదీ ఉదయం ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ కి వచ్చి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. కోవిడ్ లక్షణాలు ఉండడంతో ఖమ్మంలోని నేరడలో తన బంధువుల ఇంట్లో హోమ్ ఐ సొల్యూషన్ లో ఉన్నాడు. గత రాత్రి బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో మమతా ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. టెస్ట్ నిర్వహించగా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

    బ్లాక్ ఫంగస్ లక్షణాల కారణంతో హైదరాబాద్ గాంధీకి రిఫర్ చేస్తూ ఇచ్చిన స్లిప్


    తాళ్లూరి భ‌ద్ర‌య్య ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నార‌ని.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించామని ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ వైద్యులు తెలిపారు. ఎవరికైనా వ్యాధి నిరోధక శక్తి తగ్గితే వైరస్ లు మన శరీరంపై దాడి చేస్తాయి. అప్పుడు ఆక్సీజన్ లెవల్స్ తగ్గిన వారికి స్టెరాయిడ్ ఇస్తుంటారు. అవి వ్యాధి నిరోధక శక్తి పై కొంత ప్రభావం చూపిస్తాయి. దానికి మధుమేహం తోడైతే.. బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకొవాలని వైద్యులు సూచిస్తున్నారు
    Published by:Veera Babu
    First published: