Home /News /telangana /

BLACK FLAG ON EVERY HOME AGAINST PM MODI GOVERNMENT HARISH RAO CALL MDK VRY

Harish rao : ప్రతి ఇంటిపై నల్ల జెండా.. టీఆర్ఎస్ మరో నిరసన

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

Hariha rao : ధాన్యం కోనుగోలుగోలుతో పాటు ఇతర అంశాలపై కేంద్రంపై కత్తులు నూరుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈక్రమంలోనే ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అయితే ఎప్పుడు చేపట్టేది త్వరలో ప్రకటించనున్నారు.

ఇంకా చదవండి ...
    టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ధాన్యం కొనుగోలులో రెండు ప్రభుత్వాల
    మధ్య రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తున్నా.. ఎవరికి వారు తమ పట్టు కోసం
    చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా అనేక పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే యాసంగి
    ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర మంత్రులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర మంత్రి పియూష్
    గోయల్‌తో సమావేశం అయి పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలని
    మంత్రిని కలిసి కోరారు.

    మరోవైపు రాష్ట్రంలో కూడా పలు నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే పెరిగిన
    గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గులాబీ బాస్ పిలుపునిచ్చారు. దీంతో
    రాష్ట్రవ్యాప్తంగా నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గోన్నారు. ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ
    బలాన్ని మరింత చూపించుకునే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతి ఇంటిపై
    నల్లజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు, ఇందుకు సంబంధించి పార్టీ ఆదేశాలు
    కూడా ఇస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర విధానాలపై ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఎలాంటీ ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేశాయని కాని మోదీ ప్రభుత్వం మాత్రం అనేక ఆంక్షలు విధిస్తుందని మండిపడ్డారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Harish Rao, Pm modi, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు