Home /News /telangana /

BJYM HAS COMPLAINED TO THE DGP THAT THERE WILL BE AGITATIONS HAPPENS IF MUNAVAR FAROOQUI SHOW IS HELD IN HYDERABAD PRV

Munawar Farooqui: హైదరాబాద్​లో ఆ షో నిర్వహిస్తే.. కొట్టి పంపిస్తాం : బీజేపీ​ హెచ్చరికలు

మునావర్​ ఫారుఖీ (Photo:Twitter)

మునావర్​ ఫారుఖీ (Photo:Twitter)

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్​ వివాదాస్పదమవుతోంది. కామెడీ షో లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ ఈనెల 20వ తేదీన హైదరాబాద్​లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ (Standup comedian Munawar Farooqui) తెలంగాణ టూర్​ వివాదాస్పదమవుతోంది. కామెడీ షో లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ ఈనెల 20వ తేదీన హైదరాబాద్​లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఫారూఖి షోకు అనుమతి ఇవ్వద్దని తెలంగాణ డీజీపీ (DGP)ని కలిశారు బీజేవైఎం (BJYM) నాయకులు.  దీనికి అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ (BJP) మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది.

    తెలంగాణ నుండి మునావర్ ను కొట్టి పంపిస్తామని..

    మునావర్ ఫారూఖీ హైదరాబాద్ పర్యటన సెగలు రేపుతోంది. మునావర్ ఫరూఖీ హైదరాబాద్ కార్యక్రమాన్నిఅడ్డుకొంటామని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదివరకే హెచ్చరించారు. మునావర్ ఫరూఖీ ఈవెంట్ నిర్వహించే హాల్ ను తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. మునావర్ షోకు సంబంధించిన టికెట్లు విక్రయిస్తున్న సంస్థను దగ్దం చేస్తామన్నారు రాజాసింగ్. మునావర్ హైద్రాబాద్ కు వస్తే కొట్టి పంపిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఫారుఖీ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.



    హిందూ దేవతలను అవమానిస్తున్నారని..

    మునావర్ ఫారూఖీకి ఎవరైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. ఫారూఖీ హైదరాబాద్ లో అడుగు పెడితే తాము చేయాల్సింది చేసి తీరుతామన్నారు రాజాసింగ్. డోంగ్రీ పేరుతో స్టాండప్ కామెడీ షోలు నిర్వహిస్తుంటారు మునావర్ ఫరూఖీ. కామెడీ షో లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. హిందూ సంఘాలు ఆయనపై తీవ్రంగా ఫైరవుతున్నాయి. సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తీవ్ర దుమారం రేగింది. కర్ణాటకలో మునావర్ షోలను నిషేదించారు.

    BJP Vijayashanti: తెలంగాణ బీజేపీలో కల్లోలం.. మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

    తాజాగా మునావర్ ఈ నెల 20న హైదరాబాద్ లో షో ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్ కోసం బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. మునావర్ షోలో పాల్గొనేందుకు టికెట్ ధరను 499 రూపాయలుగా నిర్ణయించారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాజాసింగ్ హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది. రాజాసింగ్ వార్నింగ్ ఇవ్వడంతో నిర్వాహకులు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

    ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు. మునావర్ ఫారుఖీకి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) బహిరంగంగా ఆహ్వానం పలికారు.ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది. గతంలోనూ మునావర్ ఫారుఖీ షో విషయంలో అనేక సార్లు హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాజాగా మరోమారు మునావర్ ఫారూఖీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఆయన కార్యక్రమాన్ని రద్దు చెయ్యాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hyderabad, Telangana bjp

    తదుపరి వార్తలు