• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • BJP WRITES TO SEC OVER KALVAKUNTLA KAVITHA VOTING IN GHMC ELECTIONS BA

Kalvakuntla Kavitha: చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Kalvakuntla Kavitha: చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేస్తున్న కవిత (Image:@RaoKavitha/Twitter)

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఓటు వేశారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలిపింది.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఓటు వేశారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటు వేసిన ఆమె మళ్లీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఓటు వేయడాన్ని బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వెళ్తూ ఓ లేఖ రాసింది. ఒక చోట ఓటు హక్కు ఉన్న ఓటర్, మరో చోట ఎలా ఓటు వేస్తారని బీజేపీ ప్రశ్నించింది. వెంటనే కవితను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది.

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవితా ఓటు హక్కు వినియోగించుకోవడంపై టీపీసీసీ అధికార ప్రతినిది ఇందిరా శోభన్ కూడా తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేసారు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం పోతంగల్ లో ఓటు హక్కు ఉండి.. ఇప్పుడు బంజారా హిల్స్ లో ఓటు వేయడంపై ఆమె మండిప‌డ్డారు. క‌విత ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డంపై త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. కానీ, పోతంగ‌ల్‌లో ఉన్న ఓటు అలాగే ఉండ‌గా.. ఇక్క‌డ ఎలా రెండో ఓటు వేశార‌ని ఇందిరా శోభ‌న్ ప్ర‌శ్నించారు. క‌విత‌కు చిత్త‌శుద్ధి ఉంటే అక్క‌డ ఓటును తొల‌గించిన త‌ర్వాత‌.. ఇక్క‌డ ఓటు వేస్తే బాగుండేద‌న్నారు. సాక్షాత్తూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తే ఇలా రెండు చోట్ల ఓటు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగ ప‌రుస్తూ.. దొంగ ఓటు వేసిన క‌విత‌కు ఎమ్మెల్సీగా కొన‌సాగే నైతిక హ‌క్కు లేద‌న్నారు. కవిత తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్న ఇందిరాశోభ‌న్‌.. ఈ వ్య‌వ‌హారంపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు. త‌క్ష‌ణ‌మే క‌విత ఎమ్మెల్సీ ప‌ద‌విని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశామ‌న్నారు.



    డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవిత తన ఓటు వేశారు. బంజారాహిల్స్‌తో తన ఓటు వేశారు. తాను ఓటు వేస్తున్న ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఆమె ఓటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: