AMIT SHAH :మాకు అధికారం ఖాయం.. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం

అమిత్ షా (ఫైల్ ఫోటో)

AMIT SHAH : తెలంగాణలో బీజేపి అధికారంలోకి రావడం ఖాయమని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. ఇక మజ్లీస్ పార్టీకి భయపడి సీఎం కేసిఆర్ అమరుల త్యాగాలను విస్మరించాడని తీవ్రంగా మండిపడ్డారు.

  • Share this:
    నిర్మల్ లో(nirmal) బీజేపీ సభ కొనసాగుతోంది. సభకు ముఖ్యఅతిధిగా అమిత్ షా(amit shah) పాల్గోన్నారు. ఈ సంధర్భంగా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చె ఎన్నికల్లో బీజేపీ (bjp)అధికారంలోకి ఖాయమని చెప్పిన అమిత్ షా.. ఇక కర్నాటకలో , మహారాష్ట్రలో(maharshtara) విమోచన దినోత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీకి బయపడి విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ప్రశ్నించిన అమిత్ షా.. బీజేపీ ఎవరికి బయపడదని అన్నారు. ఈ నేపథ్యంలోనే 1000 మంది గిరిజనులు స్వాతంత్ర్యం కోసం పోరాడితే సీఎం కేసీఆర్‌కు కనీసం గుర్తు కూడా లేదని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే భారతీయ జనతాపార్టీ ఖచ్చితంగా గిరిజనుల త్యాగాలను గుర్తుపెట్టుకుని విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతుందని అన్నారు.

    మరోవైపు సీఎం కేసీఆర్(cm kcr) ఎమ్ఐఎమ్ చేతిలో కీలుబోమ్మగా మారాడని ఆయన దుయ్యబట్టారు. ఒక్కసారి అధికారి ఇవ్వండి తెలంగాణ గౌరవాన్ని ఇనుముడింప చేసేవిధంగా బీజేపీ తీర్చుదిద్దుతుందని అన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. గత ఎన్నికల్లో నాలుగు సీట్లలో బీజేపీ గెలిచిందని మరో మూడు సీట్ల కొద్ది తేడాతో ఓడిపోయిందని చెప్పిన ఆయన మొత్తం పార్లమెంట్ సీట్లను మోదీకి అంకితం(pm modi) ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయిందని .. ఎక్కడ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని అన్నారు.

    ఇది చదవండి : దళిత బంధు అకౌంట్‌లో డబ్బులు మాయం..? ఏం జరుగుతుందో తెలియక అయోమయం..?


    తెలంగాణ దళితులు వెనకబడిన వర్గాల కోసం బండి సంజయ్(Bandi sanjay) పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఆయన పాదయాత్రను విజయవంతం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఇక స్టేజిపై ఉన్న ఈటల రాజేందర్‌ను (Eetala Rajender)అందరు ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆయన్ను స్టేజి ముందుకు రావాలని కోరడంతో ఒక్కసారిగా సభలో నినాదాలు చేశారు.
    Published by:yveerash yveerash
    First published: