తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం.. కొత్త బాస్ బండి సంజయ్ ధీమా

బండి సంజయ్(File)

బీజేపీ కుటుంబ పార్టీ కాదని.. ప్రజాసమస్యలపై పోరాటం చేసేటప్పుడు అందరిని సంప్రదించి సమిష్టి నిర్ణయంతో ముందుకు వెళతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

  • Share this:
    తెలంగాణ బీజేపీ సారథ్య బాధ్యతలు అప్పగించినందుకు హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. సీనియర్లు, కొత్త నేతలను కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీని, పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ధీటుగా ఎదుర్కొని తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు విశ్వసిస్తున్నట్లు చెప్పారు బండి సంజయ్. బీజేపీ కుటుంబ పార్టీ కాదని.. ప్రజాసమస్యలపై పోరాటం చేసేటప్పుడు అందరిని సంప్రదించి సమిష్టి నిర్ణయంతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

    ''నాపై నమ్మకంతో ఇంత గురుతర భాద్యతను అప్పగించిన జాతీయనాయకత్వానికి ధన్యవాదాలు. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు. సీనియర్లతో పాటు ఇటీవల పార్టీలో చేరిన నేతలతో కలసి ఒక సమిష్టి నిర్ణయంతో తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళతాను. తెలంగాణలో బిజెపి పట్టణ ప్రాంతానకి మాత్రమే పరిమితం అన్న భావన సరికాదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలతో కలపి నాలుగు పార్లమెంటు స్థానాలలో విజయం సాధించాం. నోరు తెరిస్తే అబద్ధాలతో కాలం గడిపే సీఎం కేసీఆర్ మాటలను ఎవ్వరు విశ్వసించడం లేదు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ , కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మారుస్తూ ప్రజల వంచిస్తున్న అధికార పార్టీ బండారాన్ని బయటపెడతాం, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తాం.'' అని బండి సంజయ్ అన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: