BJP VIJAY SANKALP SABHA WE WILL DEFINITELY UPROOT TRS KCR KTR GOVT SAYS BJP TS CHIEF BANDI SANJAY SK
Bandi Sanjay: భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఒట్టు.. కేసీఆర్ గడీలను కూల్చేస్తాం: బండి సంజయ్
బండి సంజయ్
BJP Hyderabad Meeting: పరేడ్ గ్రౌండ్స్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల పాలనలో రాష్ట్ర ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఓడించి.. ప్రజలకు సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు.
చార్మినార్ భాగ్యలక్ష్మీ (Charminar Bhagyalaxmi Temple)అమ్మవారి మీద ఒట్టేసి చెబుతున్నాం... కేసీఆర్ (CM KCR) గడీల పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల పాలనలో రాష్ట్ర ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఓడించి.. ప్రజలకు సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. బీజేపీ గెలిస్తే.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో.. తెలంగాణ (Telangana) అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. దేశ ప్రజల పాలిట నరేంద్ర మోదీ దేవుడులాంటి వారని.. అలాంటి నాయకుడి పట్ల.. టీఆర్ఎస్ నేతలు తప్పుడు భాషను ఉపయోగిస్తున్నారి విరుచుకుపడ్డారు బండి సంజయ్.
బండి సంజయ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
ప్రధాని మోదీపై తప్పుడు భాషను టీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్నారు. కరోనా సమయంలో ఆదుకున్నందుకా? పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నందుకా? ఉక్రెయిన్ -రష్యా యుద్ధాన్ని మన బిడ్డలను కాపాడుకున్నందుకా?
నరేంద్ర మోదీ సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. నాకు విముక్తి కలుగుతుందని తెలంగాణ తల్లి పులకించిపోతుంది. నరేంద్ర మోదీ పేదల నాయకుడు. ఆయన దేవుడు.
ఇంత మంది యువకుల నినాదాలు విని కేసీఆర్‌కు గుండెలు అదురుతున్నాయి. మోదీ పులిని చూసి కేసీఆర్ నక్క దాక్కుంది. కేసీఆర్ లాంటి దద్దమ్మలకు కేసీఆర్ గొప్పతనం తెలియదు.
రాష్ట్ర ప్రజలకు వేల కోట్ల నిధులు ఇస్తున్నారు. కేంద్రం నిధులను ఇస్తోంది. కానీ కేసీఆర్ అభివృద్ధి చేయడం లేదు.నరేంద్ర మోదీని అప్రతిష్ట పాలు చేయాలనే.. రాజకీయ లబ్ధి కోసం వ్యవహరిస్తోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దంచాలా? వద్దా?
తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సమస్యలతో తల్లడిల్లుతున్నారు. వారికి భరోసా ఇచ్చేందుకే జాతీయ కార్యకవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో పెట్టాం. దేశం కోసం, రాష్ట్రం కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు ధైర్యం నింపేందుకే ఇక్కడ నిర్వహించాం.
నిధులిచ్చేది మోదీ సర్కార్. కానీ వాటిని కేసీఆర్ నిధులను దారి మళ్లిస్తున్నారు. వచ్చేసారి అధికారం ఇస్తే.. డబుల్ ఇంజిన్ సర్కాన్ నడుస్తుంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.
తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే.. మోదీ గారి నీతివంతమైన పాలన రాష్ట్రంలో రావాలి. భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నాం. కేసీఆర్ గడీలను బద్ధలు కొడతాం.
విజయ్ సంకల్ప్ సభకు వచ్చిన జన సమూహాన్ని చూసి.. ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జన సమూహాన్ని చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇంత జనసమీకరణ చేసినందుకు బండి సంజయ్‌ను మెచ్చుకున్నారు. ఆయన భుజం తట్టి అభినందించారు. విజయ్ సంకల్ప్ సభ విజయవంతమైనందుకు ఇతర బీజేపీ నేతలు కూడా సంతోష వ్యక్తం చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.