Home /News /telangana /

BJP THREATENING TO ERASE TELANGANA HISTORY ACCUSED TRS MLC KAVITHA SLAMS ASSAM CM HIMANTA REPLIED BACK MKS

Kavitha vs Himanta: అస్సాం సీఎంకు కవిత ఘాటు కౌంటర్.. అదే స్థాయిలో హిమంత పంచ్

కవిత, హిమంత డైలాగ్ వార్

కవిత, హిమంత డైలాగ్ వార్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా, నిజాం, అసదుద్దీన్ ఓవైసీ వారసత్వ రద్దు అంటూ హన్మకొండ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ . ఆయనకు కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా కౌంటరిచ్చారు. వీళ్లిద్దరి మధ్య ట్విటర్ వేదికగా డైలాగ్ వార్ నడిచింది..

ఇంకా చదవండి ...
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317ను నిరరిస్తూ హన్మకొండలో బీజేపీ నిర్వహించిన సభ రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ఉద్యోగులు, నిరుద్యోగుల అంశాలతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా, నిజాం, అసదుద్దీన్ ఓవైసీ వారసత్వ రద్దు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా కౌంటరిచ్చారు. విభజన రాజకీయాలు తప్ప బీజేపీకి మరోటి చేతకాదని, తెలంగాణ వారసత్వాన్ని చెరిపేయాలనుకుంటున్నారని మండిపడ్డ కవిత బీజేపీని ఎండగట్టగా, హిమంత సైతం అదే స్థాయిలో ఆఖరి పంచ్ విసిరారు. వివరాలివి..

జీవో 317 నిరసన సభ పేరుతో తెలంగాణ బీజేపీ శాఖ ఆదివారం నాడు వరంగల్ హన్మకొండలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సభకు అతిథిగా హాజరైన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులను సంతోషపెట్టకుండా సీఎం కేసీఆర్ ఏంచేస్తున్నట్లు? పరిపాలిస్తున్నాడా? ఫామ్ హౌజ్ నడుపుతున్నాడా? అని విమర్శించారు. టీఆర్ఎస్ చేతిలో తెలంగాణ నిరుద్యోగులు మోసపోయారని, కేసీఆర్ నిరంకుశత్వానికి త్వరలోనే చరమగీతం పాడుతామని హిమంత అన్నారు. అంతటితో ఆగకుండా,

హిమాన్షు చేతికి cm kcr పగ్గాలు.. ఆర్టికల్ 370లాగే Asaduddin వారసత్వం రద్దు: Assam CM సంచలనం


తెలంగాణలో ముస్లింల ఓట్ల ఓట్ల కోసం గులాబీ బాస్ కేసీఆర్.. అసదుద్దీన్ ఓవైసీలాంటి వాళ్లను చేరదీశారని, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలు కాబట్టే మొఘలుల్ని కీర్తించిందని, అయితే నవ తెలంగాణ ఏర్పడాలంటే మాత్రం ఇక్కడ నిజాం వారసత్వంతోపాటు ఓవైసీల వారసత్వం కూడా అంతం కావాల్సి ఉందని, ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లే తెలంగాణలో నిజాం, ఓవైసీల పేర్లను నామరూపాల్లేకుండా బీజేపీ చేస్తుందని అస్సాం సీఎం వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుట్ల కవిత ఘాటుగా స్పందించారు.

PM Modi : కొవిడ్ కట్టడిపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు.. రాష్ట్రాలకు హెల్త్ మినిస్టర్ బ్రీఫింగ్ రేపుతెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను తుడిచేస్తామని బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పడం దారుణమని, శతాబ్దాలుగా ఐక్యతకు చిహ్నమైన తెలంగాణలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుండటం దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నేరుగా అస్సాం సీఎం బిశ్వ శర్మ పేరును ప్రస్తావిస్తూ.. ఈసారి తెలంగాణకు వచ్చేటప్పుడు హోం వర్క్ చేసి రావాలని, ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో హిమంత చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు కవిత. 2018 ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలాగే విర్రవీగిందని, చివరికి తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేశారని కవిత గుర్తుచేశారు.

Covid-19: భారీ ఊరట: సోమవారం నుంచి సెలూన్ల మూసివేత.. సర్కారు ఉత్తర్వుల సవరణ


తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ఇప్పటికే 1.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిందని, మరి ఇదే బీజేపీ 2014లో హామీ ఇచ్చినట్లు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తోందా? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశం అధోగతికి పోగా, కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని, తెలంగాణలో అమలవుతోన్న పథకాలేవీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆలోచన కూడా రావని హిమంతపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా,

shocking: అమ్మ బ్రహ్మదేవుడో!! -ఒకే వ్యక్తి 11సార్లు Covid వ్యాక్సిన్ -ఒంట్లో రోగాలన్నీ మాయం..ట్విటర్ వేదికగా కల్వకుంట్ల సంధించిన విమర్శలకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ట్విటర్ లోనే సమాధానమిచ్చారు. ‘కావాలంటే నా ప్రసంగం రికార్డును పంపుతాను. నవ తెలంగాణను ఏకం చేయడం, దానిని భారత్ వర్ష్ కీర్తితో ముడిపెట్టడం గురించి మాత్రమే నేను మాట్లాడాను. అంతేగానీ విభజన గురించి కాదు. అలాగే, మరో విషయం గుర్తుంచుకోండి.. బీజేపీకి ఒకప్పుడు లోక్ సభలో 2 సీట్లే ఉండేవి. కానీ ఇప్పుడు ఉదాహరణ మీ కళ్లముందే ఉంది..’అని అస్సాం సీఎం పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assam, Bjp, Kalvakuntla Kavitha, Trs, Warangal

తదుపరి వార్తలు