మంగళవారం ఉదయం కౌన్సిల్ సమావేశం నిర్వహించడం లేదంటూ హైదరాబాద్ నగర బీజేపీ ( bjp )కార్పోరేటర్లు అకస్మత్తుగా ఆందోళన చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ( ghmc ) కార్యాలయం ముందు బైఠాయించి, మేయర్‌కు ( ghmc mayor ) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పాటు చాలా చేపు ధర్నా నిర్వహించారు. మేయర్ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భాజపా కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అనంతరం కార్యాలయంలోని పూల కుండీలను ధ్వంసం చేశారు.దీంతో అందోళణ చేసిన కార్పోరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు..
అయితే అరెస్ట్ చేసిన కార్పోరేటర్లను అరెస్ట్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులు అన్న కనీస గౌరవం లేకుండా పోలీసులు బీజేపీ కార్పోరేటర్ల (BJP Corporators) పట్ల దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో కార్పోరేటర్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు.
ఇది చదవండి : ఎంత ధాన్యం కొంటారు... ? కేంద్రమంత్రి పియూష్‌గోయల్ టీఆర్ఎస్ మంత్రుల భేటి..
జీహెచ్ఎంసీ (GHMC) పాలకవర్గం ఏర్పడి దాదాపు ఏడాది గడిచినా ఇప్పటివరకూ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. కరోనా సాకుతో నామమాత్రంగా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు.కార్పోరేటర్లకు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ అందుబాటులో ఉండటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే జీహెచ్ఎంసీని నడిపించాలనుకుంటే... ఇక దానికి ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.
రాజకీయాల పేరుతో అభివృద్దిని అడ్డుకోవడం సమంజసం కాదని... బీజెపి కార్పొరేటర్లకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం అప్రజాస్వామికమని బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని అన్నారు.
ఇది చదవండి : బీజేపీ కార్పోరేటర్ల చర్య సిగ్గు చేటు.. మేయర్ మండిపాటు.. కారణం ఇదే.
74వ రాజ్యాంగ సవరణను టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని... పాత బిల్లులే ఇప్పటికీ చెల్లించలేదని అన్నారు. ఇలాగైతే కొత్త పనులు ఎలా చేయించగలరని ప్రశ్నించారు. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి పోకడలు మానుకోవాలని హితవు పలికారు...
మరోవైపు కార్పోరేటర్ల చర్య మేయర్ గద్వాల విజయలక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి చర్యలను ఖండించారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడానికి గల కారణాలను వివరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన మేయర్ విజయలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయామని తెలిపారు.(ghmc mayor vijayalaxmi fires on bjp corporters ) కరోనా వల్ల వర్చువల్ సమావేశాలు నిర్వహించామని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సమావేశం నిర్వహించలేకపోయామన్నారు. కౌన్సిల్ సమావేశం లేకపోయినా నా వద్దకు వచ్చి ఏదైనా అడగొచ్చు. కార్యాలయానికి వచ్చి కుర్చీలు ధ్వంసం చేయడం సరికాదు. జీహెచ్‌ఎంసీలోని వస్తువులు మేయర్ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. పార్టీలకు అతీతంగా వచ్చి పనులు అడిగితే చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, GHMC