హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSPSC : నేడు BJP మహాధర్నా.. పేపర్ లీకేజీలపై బండి సంజయ్ ఆందోళన

TSPSC : నేడు BJP మహాధర్నా.. పేపర్ లీకేజీలపై బండి సంజయ్ ఆందోళన

నేడు BJP మహాధర్నా (image credit - twitter - bandisanjay_bjp)

నేడు BJP మహాధర్నా (image credit - twitter - bandisanjay_bjp)

TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై భారతీయ జనతా పార్టీ (BJP) ఇవాళ ఆందోళనకు దిగుతోంది. నిరుద్యోగుల నుంచి దీనికి భారీగా మద్దతు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఇవాళ హైదరాబాద్... ఇందిరాపార్క్ దగ్గర ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేయబోతోంది బీజేపీ. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో పేపర్ల లీకేజీ వ్యవహారం కేసుల పరంగానే కాకుండా.. రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన వ్యాఖ్యలకు చట్టపరంగా వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... దీనిపై నిరుద్యోగుల నుంచి మద్దతు కూడగట్టేందుకు సిద్ధమయ్యారు.

ఈ మహా ధర్నా షెడ్యూల్ గమనిస్తే.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహా ధర్నా జరగనుంది. ఇందులో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. TSPSC పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్టుల వంటి అంశాలపై బుధవారం పార్టీ సమావేశంలో చర్చించిన బండి సంజయ్ .. ఈ మహా ధర్నా ప్లాన్ చేశారు.

కలకలం రేపిన నోటీసులు :

పేపర్ లీక్ కేసును డీల్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)... బండి సంజయ్‌కి నోటీసులు పంపడం రాజకీయ దుమారం రేపింది. మార్చి 24న సిట్ కార్యాలయానికి వచ్చి.. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు కోరడంతో.. ఈ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ... మహా ధర్నాకు సిద్ధమైంది. ఈ మహా ధర్నా ఎలా జరుగుతుంది? ప్రశాంతంగా కొనసాగుతుందా లేక ఆందోళనలు అదుపు తప్పుతాయా అనేది పోలీసులకు ఒకింత టెన్షన్ తెప్పిస్తోంది.

First published:

Tags: Bandi sanjay, Bjp, Telangana, Telangana News, TSPSC

ఉత్తమ కథలు