Home /News /telangana /

BJP TELANGANA PRESIDENT BANDI SANJAY GONE TO ESSAPALLY OF NIZAMABAD VRY

Bandi sanjay : పంజాబ్ తరహాలో... ఎంపీ అర్వింద్‌పై దాడి... ఇస్సపల్లికి బండి సంజయ్..

Bandi-Sanjay-Kumar

Bandi-Sanjay-Kumar

Bandi sanjay : పంజాబ్‌లో పీఎం, ఇక్కడ ఎంపీ అర్వింద్ పై ఒకే తరహాలో దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు.. ఎంపీ అర్వింద్ పై జరిగిన దాడి ముమ్మాటికి టీఆర్ఎస్ దాడేనంటూ ఆరోపించారు.

    నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో జరిగిన సంఘటన మరింత రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇస్సపల్లిలో టీఆర్ఎస్ తనపై దాడి చేసిందంటూ ఇప్పటికే ఎంపీ అర్వింద్ ఆరోపణలు తీవ్రం చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి...దీనికి తోడుగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లికి బయలుదేరి వెళ్లాడు. ఘర్షణలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన నిజామాబాద్‌కు వెళ్లారు. అయితే బండి సంజయ్ అక్కడి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసి వెనక్కి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..అయితే ఇప్పటికే ఆయన అరెస్ట్ పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా విచారణ జరుపుతుండగా మరోసారి అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. కాగా గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు ఖచ్చితంగా వెళతానని బండి స్పష్టం చేశారు.

    కాగా నిజామాబాద్‌కు బయలుదేరే సయమంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడిని , పంజాబ్‌లో పీఎం మోడీపై జరిగిన దాడిని ఒకే రకంగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీపై ఖలిస్తాన్ గ్రూపు దాడి జరిపితే.. దాన్ని రైతుల దాడిగా అభివర్ణించిన టీఆర్ఎస్ పార్టీ మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై దాడి చేసింది తాము కాదని రైతులు తేల్చి చెప్పారని అన్నారు. తెలంగాణలో రైతులు , కత్తులు రాళ్లు పట్టుకునే స్థితిలో లేరని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా చర్చిస్తారని అన్నారు. దాడి వెనక ఎవరున్నారో అందరికి తెలుసని అన్నారు.

    Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..

    ఈ నెల 25న ఇస్సపల్లిలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొన్న విషయం తెలిసిందే... ఈ ఘర్షణలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. ఈ దాడిలో ఎంపీ వాహనం ధ్వంసమైంది. పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. బీజేపీ, TRS వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఒక దశలో ఎంపీ అర్వింద్ సైతం రోడ్డు బైఠాయించిన పరిస్థితి నెలకొంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, Hyderabad, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు