Home /News /telangana /

BJP TELANGANA PRESIDENT BANDI SANJAY GIVES CLARITY ON KOMATIREDDY VENKATAREDDY JOINING IN BJP SK

Bandi Sanjay: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారా? క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Telangana: రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. మునుగోడుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్సే హాట్ టాపిక్. మొన్నటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (KomatiReddy Rajagopal Reddy) గురించి జోరుగా చర్చ జరగ్గా.. ఇప్పడు ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి రచ్చ జరుగుతోంది. వెంకటరెడ్డి (Komatireddy VenkatReddy), రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకే గాటిన కట్టడం.. వెంకటరెడ్డి కూడా తమ్ముడి దారిలోనే వెళ్తారన్న ప్రచారం జరగడం.. కాంగ్రెస్‌లో దుమారానికి దారితీసింది. మరి నిజంగానే వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారా? అనే ప్రశ్నకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. వెంకటరెడ్డి బీజేపీలో చేరుతున్నారని తాను అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. తాను అనని మాటలను.. అన్నట్లుగా మీడియా చూపిస్తోందని విమర్శించారు.

    బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. శుక్రవారం భట్టుపల్లి గ్రామంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి స్థానికులు బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం పాదయాత్ర శిబిరం వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.



    కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాతో టచ్‌లో ఉన్నానని నేను ఎక్కడా అనలేదు. అనని మాటలను అన్నారని మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి బ్రేకింగ్స్ వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు వెళ్లినా ప్రధాని మోదీ కలుస్తారు. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోదీని కలుస్తుంటారు. అని బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆరే ఉపఎన్నికలు కోరుకున్నారని విమర్శించారు. దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఆరు నెలల చొప్పున సీఎం కేసీఆర్ టైమ్ పాస్ చేశారని.. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక పేరుతో మళ్లీ టైంపాస్ చేస్తారని విమర్శించారు.



    ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. మునుగోడుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ పార్టీకి రేవంత్ రెడ్డితో పార్టీముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. ఐతే చండూరు సభకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకావడం లేదు. పార్లమెంట్ సమావేశాలున్నందున సభకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయనే సమావేశానికి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల వేళ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం లేకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాత్రం రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడీ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీలో రచ్చ జరుగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bandi sanjay, Komatireddy rajagopal reddy, Komatireddy venkat reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు