హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: అంబేద్కర్ పేరు పెడితే సరిపోదు.. సీఎం సీట్లో దళితుడిని కూర్చోబెట్టాలి.. బండి కౌంటర్

Bandi Sanjay: అంబేద్కర్ పేరు పెడితే సరిపోదు.. సీఎం సీట్లో దళితుడిని కూర్చోబెట్టాలి.. బండి కౌంటర్

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay: కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాతే... కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతామని ప్రకటించారని బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎం పార్టీని సంతృప్తి పరచడానికే జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతున్నారని మండిపడ్డారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నూతనంగా నిర్మిస్తున్నతెలంగాణ సచివాలయ భవనానికి (Telangana New Secretariat) డాక్టర్ అంబేద్కర్ (Dr. B.R.Ambedkar) పేరు పెడుతున్న విషయం తెలిసిందే. 'డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ  సచివాలయం'గా నామకరణం చేస్తూ తెలంగాన ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. అంతేకాదు కేంద్రం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్పందించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని.. కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా.. కొత్త సచివాలయంలో సీఎం పీఠంపై దళితుడిని కూర్చోబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  Amit Shah Hyderabad Tour: రేపు హైదరాబాద్‌కు అమిత్ షా..హోంమంత్రి షెడ్యూల్ వివరాలు ఇవే

  '' దళితుడిని సీఎం చేస్తానని, మాట నిలబెట్టుకోకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్ హామీ ఏమైంది? దళితులపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు శాశ్వతంగా దళితుడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి. కొత్త సచివాలయంలో సీఎం కొత్త సీట్లో దళితుడినే కూర్చోబెట్టాలి. దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.'’అని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్నే మారుస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వీడియోలు బయటపడటంతో చర్చను దారి మళ్లించేందుకే.. అంబేద్కర్ రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. అంతేప్ప ఆయనపై ప్రేమతో కానేకాదని విమర్శించారు బండి సంజయ్.

  Telangana: తెలంగాణ కొత్త సచివాలయానికి 'అంబేద్కర్' పేరు.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

  కేసీఆర్ చెప్పిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఎక్కడికి పోయింది? అంబేద్కర్ స్మృతి భవనం జాడ ఏదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. 12 మంది దళితులను కేంద్ర మంత్రులను, దళితుడిని రాష్ట్రపతిని చేయడంతోపాటు ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ దక్కుతుందని ఆయన అన్నారు. కేంద్రంలో దళితులకు ఎంతో చేశామని... ఇక్కడ కేసీఆర్ దళితులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ఢిల్లీ నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్ కూడా బీజేపీ ఆఫీసుకు వెళ్లి ఈ విషయమై బండి సంజయ్‌తో చర్చించారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని వస్తున్న విజ్ఞప్తుల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించానని ఆయన చెప్పారు.

  ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అమిత్ షా నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. కేంద్రప్రభుత్వ బలగాల పరేడ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. శుక్రవారం స్ఫూర్తి కేంద్రాలను సందర్శన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు అందరూ పరేడ్ గ్రౌండ్స్‌కి రావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాతే... కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతామని ప్రకటించారని బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎం పార్టీని సంతృప్తి పరచడానికే జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతున్నారని మండిపడ్డారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bandi sanjay, CM KCR, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు