(శ్రీనివాస్. పి, న్యూస్ 18తెలుగు, కరీంనగర్)
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నేడు భారీ బహిరంగ సభ జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (JP Nadda) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy). ఓబిసి మోర్చా జాతీయ అధ్య క్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జీ మురళీధర్ రావుతో సహా పలువురు ముఖ్య నేతలు ఈ బహి రంగ సభకు హాజరు కానున్నారు.
ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చేలా పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా హాజరయ్యే ప్రణాళిక రూపొందించడంతో పాటు రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్ఆర్ఆర్ మైదానంతో పాటు కరీంనగర్ జన సంద్రం అయ్యేఅవకాశాలున్నాయి.
బండి సొంత ఇలాఖాలో బహిరంగ సభ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వంతగడ్డపై జరుగుతున్న సభకావడం, నడ్డా మొదటి సారి కరీంనగర్‌కు వస్తుండటంతో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బహిరంగ సభను సక్సెస్ చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేననే సంకేతాలను పంపాలని భావిస్తోంది. అత్యధిక సంఖ్యలో జనం అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు కాలం చెల్లిందనే భావన పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయి.
నాడు కేసిఆర్ సింహా గర్జన...నేడు బండి గర్జన
వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేసిఆర్ గ్రాఫ్ అమాంతంగా పెరగడానికి బీజం వేసింది కరీం నగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహి చిన సింహ గర్జనే. ఇదే మైదానాన్ని ఎంచుకొని నేడు కేసిఆర్ సర్కార్‌పై బండి గర్జించనున్నారు. కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్‌కు అగ్రపీటం వేసిన కరీంనగర్‌లోనే సభను సక్సెస్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పనైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బండి సంజయ్ యోచిస్తున్నారు.
తెలంగాణ ప్రజలంతా స్వచ్చందంగా తరలిరావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు. మరో వైపు తెలంగాణ యువత, హిందుత్వ భావజా లమున్న ప్రజలంతా స్వచ్చందంగా కరం నగర్ బహిరంగ సభకు హాజరయ్యేలా ప్రచారం నిర్వహించారు. బండి సంజ య్ మొత్తం 56 అసెంబ్లీ నియో వర్గాల్లో 1400 కిలో మీటర్లు నడిచారు.కరీంనగర్లో జరిగే బహిరంగ సభ కపైనా 6వ విడత ప్రజా సంగ్రా పాదయాత్ర షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Karimnagar, Telangana