హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: బడిలో బండి సంజయ్.. విద్యార్థులతో మాటామంతీ.. బాల్యమిత్రుడికి ఆత్మీయ సత్కారం 

Bandi Sanjay: బడిలో బండి సంజయ్.. విద్యార్థులతో మాటామంతీ.. బాల్యమిత్రుడికి ఆత్మీయ సత్కారం 

బండి సంజయ్

బండి సంజయ్

Bandi Sanjay: పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, భరోసా కల్పిస్తూ పాదయాత్ర సాగిస్తున్న బండి సంజయ్ అడుగులు బడి వైపు పడ్డాయి. విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. అనంతరం బాల్య మిత్రులతో కలిసి సందడి చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(కట్ట లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

ప్రజల సమస్యలను వింటూ, వారికి భరోసా కల్పిస్తూ మరోపక్క తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలను సందిస్తూ పాదయాత్రగా ముందుకుసాగుతున్న భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ (Karimnagar) పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) బడి పిల్లలతో కలిసి కొద్దిసేపు కాలక్షేపం చేశారు. విద్యార్థులతో సరదాగా గడిపారు. ఫొటోలు దిగారు. ఐదవ విడత పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్ ఆరవ రోజైన శనివారం నిర్మల్ జిల్లాలోని లోలం గ్రామం నుండి సిర్గాపూర్ గ్రామం వరకు సుమారు 11.4 కిలో మీటర్ల దూరం వరకు పాదయాత్రను కొనసాగించారు.

Bandi Sanjay: ఒక్క ఫొటో ప్లీజ్.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో సెల్ఫీల జోరు 

 అనంతరం సిర్గాపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన విడిదిలో బస చేశారు. అయితే పాదయాత్రలో భాగంగా లోలం గ్రామం నుండి కాలినడక బయలుదేరిన బండి సంజయ్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిలావర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించారు. దివ్యాంగులతో కలిసి కొద్ది పాఠశాల ఆవరణలోనే గడిపారు. దివ్యాంగ విద్యార్థులతో సరదాగా సంభాషించారు. వారు గీసిన చిత్రాలను తిలకించారు. కుశల ప్రశ్నలు వేసి వారి బాగోగులను తెలుసుకున్నారు. దివ్యాంగులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణి చేశారు. అదే పాఠశాలలోని మిగతా విద్యార్థులతో కూడా కలిసి ఫోటోలు దిగారు.

అనంతరం..  పాదయాత్రగా సిర్గాపూర్ గ్రామానికి చేరుకున్నబండి సంజయ్‌ని బాల్య మిత్రులు కలిశారు. వీరంతా కరీంనగర్‌లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బండి సంజయ్‌తో కలిసి చదువుకున్నారు. వీరిలో తాండూరు కంటి వైద్యాధికారిగా పనిచేసి స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసిన సందవెని మహేంద్రనాథ్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సంజయ్‌ను కలిశారు. స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసిన తన మిత్రుడు మహేంద్రనాథ్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అటు బాల్యమిత్రులు కూడా  కలిసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. అందరూ కలిసి నవ్వుతూ సరదాగా గడిపారు. బాల్య మిత్ర మండలి కన్వీనర్ బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ బాల్య మిత్రులు వెల్దండి వేణు, విశ్వనాత అనిల్, చెన్నాడె ప్రవీణ్, సురేందర్ రెడ్డి, మంచాల రమేష్, తోట ప్రకాష్, పుల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Adilabad, Bandi sanjay, Bjp, Telangana

ఉత్తమ కథలు