Elections 2023 : ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ఏపీ, తెలంగాణపై బీజేపీ స్కెచ్ ఇదీ...

దక్షిణాదిని దున్నేయాలనుకుంటున్న బీజేపీ... కర్ణాటక తమ కంట్రోల్‌లోకి వచ్చేసినట్లేనని భావిస్తోంది. అందుకే ఇప్పుడిక తెలుగు రాష్ట్రాలపై పూర్తి ఫోకస్ పెడుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 6:50 AM IST
Elections 2023 : ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ఏపీ, తెలంగాణపై బీజేపీ స్కెచ్ ఇదీ...
అమిత్ షా, నరేంద్ర మోదీ
  • Share this:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బలపడితే... కేంద్రంలో తమను ఢీ కొట్టే పార్టీయే ఉండదని బలంగా నమ్ముతోంది బీజేపీ అధినాయకత్వం. అందుకే ఆఘమేఘాలపై టార్గెట్ తెలంగాణ, టార్గెట్ ఏపీ ప్రారభించేసింది. ఇందులో భాగంగా... తెలంగాణకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా... నెల నెలా సమీక్ష జరపనున్నారు. క్షేత్రస్థాయి వరకూ బీజేపీని తీసుకెళ్లాలనీ, 2023లో జరిగే జమిలి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా... టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలని ఆల్రెడీ సిగ్నల్స్ ఇచ్చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఆ పార్టీ నేతలు... విమర్శల వేడి పెంచారు. కొత్త సెక్రటేరియట్ అవసరం లేదనీ, పాలన పడకేసిందనీ మోత మోగిస్తున్నారు. ఇక ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ ఆల్రెడీ నిధుల కొరతతో ఉంది. కాబట్టి... ప్రతిపక్ష టీడీపీని పూర్తిగా అణచేసి... ఎన్నికలు వచ్చేలోపు... బలమైన పార్టీగా తయారై... వైసీపీని ఢీకొట్టాలని స్కెచ్ వేసుకుంది కమలదళం. ఐతే... ఇదంతా పైకి కనిపించే సీన్. తెరవెనక అసలు ప్లాన్ వేరే ఉంది. అదే... టార్గెట్ బీసీ.

Target BC : ఏపీ, తెలంగాణలో బీసీ వర్గ ప్రజల సంఖ్య ఎక్కువ. ఆ వర్గాల్ని ఆకట్టుకోవడం ద్వారానే టీఆర్ఎస్, వైసీపీ అధికారంలోకి వచ్చాయి. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే... ఏపీ సీఎం జగన్... మంత్రివర్గ కూర్పులో... బీసీలకు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారు. ఇదే విధంగా... ఇప్పటివరకూ ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్‌పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిన బీజేపీ... మధ్యలో రెడ్డి సామాజిక వర్గ నేతలను పార్టీలో కలుపుకొని... పాలక పక్షానికి పరోక్ష హెచ్చరికలు పంపింది. ఇప్పుడు బీసీ నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీ సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్న ఆర్.కృష్ణయ్యను పార్టీలోకి పిలిచేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలిసింది.

కృష్ణయ్యను ఆహ్వానించాలనుకోవడం సాధారణ ఎత్తుగడ కాదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా కృష్ణయ్యను చంద్రబాబు ప్రకటించారు. అంత బలమైన నాయకుణ్ని పార్టీలోకి ఆహ్వానిస్తే... బీసీల మద్దతు తమకు దక్కుతుందనీ, తద్వారా ఏపీ, తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ తమ ఖాతాలోకి చేరుతుందని బీజేపీ ప్రణాళికలు వేసుకుంటోంది. ఏపీలో వైసీపీ తరపున కృష్ణయ్య ప్రచారం చేయగా... అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ... ఆ తర్వాత ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా మర్చిపోయిందనే విమర్శలొస్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న బీజేపీ... పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.

అంత తేలిక కాదు : బీజేపీ ఎన్ని చేసినా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం అంత తేలిక కాదంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో టీఆర్ఎస్‌కి ప్రజలు భారీ మద్దతు ఇవ్వడం వల్ల... ఇప్పట్లో ఆ ప్రభుత్వానికి ఢోకా ఉండదంటున్నారు. అలాగే... ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఏపీలో బీజేపీకి మద్దతు లభించకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. బీజేపీ పెద్దలు మాత్రం ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని తేల్చేస్తూ... అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...