ధాన్యం కొనుగోలు (Paddy buying) అంశం తెలంగాణలో తీవ్ర రాజకీయ రగడకు దారి తీస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణ (Telangana)లో ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేసింది. ఇప్పటికే కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వడ్ల కొనుగోళ్లు (Grain purchases), కాంటాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ (Bandi sanjay letter to CM KCR) రాశారు . ప్రతి గింజా కొంటామని ప్రకటించి 15 రోజులు దాటుతుందని.. ఇప్పటి వరకు పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించాలని లేఖలో (In Letter) రాశారు. తాను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర (Walk) చేస్తున్నానని..ఈ విషయాన్ని రైతులు (farmers) తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వమని..
తెలంగాణ (Telangana)లో మొత్తం 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉందని బండి సంజయ్ తెలిపారు. ఇప్పటివరకు కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని లేఖలో ఆక్షేపించారు. ఈ లెక్కల బట్టే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అర్థమవుతుందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ (TRS Government).. రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వరి రైతులకు (Paddy farmers) అండగా పోరాటం కొనసాగిస్తామన్నారు బండి సంజయ్. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి..ప్రతి గింజా కొనుగోలు చేయాలన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahbubnagar)లో గద్వాల్ జిల్లాలో 71 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందని.. కానీ కేవలం రెండు మాత్రమే ప్రారంభించారని ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లాలో 225 కేంద్రాలకు గాను 19 ఏర్పాటు చేశారని, ఇటు నారాయణపేట్‌లో 91 కేంద్రాలకు 70 మాత్రమే ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Grain purchasing centers) ప్రారంభించాల్సి ఉందని..ఐతే కేవలం 2 వేల 500 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారని బండి సంజయ్ మండిపడ్డారు.
ఇంతకుముందే లేఖ..
కాగా, గతంలోనూ ధాన్యం కొనుగోళ్లపై బండి సంజయ్ సీఎంకు లేఖ రాశారు. అందులో .. వరి ధాన్యం పండించే రాష్ట్రాలు చాలా ఉన్నయ్. అక్కడ ఎలాంటి గొడవ లేదు. సాఫీగా కొనుగోళ్లు జరుగుతున్నాయ్. ఇక్కడే ఎందుకు గొడవ వస్తోంది. మన పొరుగు రాష్ట్రం ఏపీలోనూ కేంద్రంతో ఏ గొడవా లేదు. మిల్లర్ల ప్రమేయం లేదు కదా.. మీ వైఖరిని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణలోనే పెద్ద కుంభకోణం దాగి ఉందనే ఉన్నట్లు కన్పిస్తోంది. రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మడం వంటి వ్యవహారాలు చాలా జరిగినట్లు మా దగ్గర సమాచారం ఉంది. మిల్లర్లు, మీరు కుమ్మక్కై చేస్తున్న ఈ స్కాం బండారం బయటపడుతుందని మీకు అర్ధమైంది. అందుకే కేంద్రంపై కావాలని గొడవ పెట్టుకుని సమస్యను దారి మళ్లిస్తున్నట్లు మాకు అర్ధమవుతోంది.
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే...రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బిజెపి తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేతకాకపోతే మీరు ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల జీవితాలతో మీరు, టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయం చేస్తే బిజెపి చూస్తూ ఉరుకొదని హెచ్చరిస్తున్నాం. రైతులకు అండగా బిజెపి తెలంగాణశాఖ ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది” అని బండి సంజయ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Farmers, Mahbubnagar, PADDY PROCUREMENT