హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi sanjay : బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... టీఆర్ఎస్‌ పని అయిపోయింది...!

Bandi sanjay : బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... టీఆర్ఎస్‌ పని అయిపోయింది...!

Bandi-Sanjay-Kumar

Bandi-Sanjay-Kumar

Bandi sanjay : బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొరారు.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందని, అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని అన్నారు.

కరీంనగర్‌లో ( Karimnagar )  మూడు రోజులుగా జరుగుతున్నబీజేపీ జిల్లా శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో బండి సంజయ్ ( Bandi sanjay ) పాల్గోని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.లంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ( Trs ) పనైపోయిందని, అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని అన్నారు.  బీజేపీ సిద్దాంతాలు, ( BJP ) లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కేసీఆర్ ( cm kcr ) ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను క్షేత్ర స్థాయిలో ఎండగట్టేందుకు అనుసరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు చెప్పారు.కరీంనగర్‌లో ( Karimnagar )  మూడు రోజులుగా జరుగుతున్నబీజేపీ జిల్లా శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో బండి సంజయ్ ( Bandi sanjay ) పాల్గోని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.లంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ( Trs ) పనైపోయిందని, అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని అన్నారు.  బీజేపీ సిద్దాంతాలు, ( BJP ) లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కేసీఆర్ ( cm kcr ) ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను క్షేత్ర స్థాయిలో ఎండగట్టేందుకు అనుసరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు చెప్పారు.

మరోవైపు నమ్ముకున్న సిద్ధాంతం, లక్ష్యాల కోసం తెగించి కొట్లాడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని అన్నారు.లక్ష్యసాధన కోసం ప్రాణ త్యాగాలకు కు కూడా వెనుకాడని చరిత్ర బీజేపీ కార్యకర్తలకు ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందని, అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని అన్నారు.  ఈసారి ‘బీజేపీకి అవకాశం ఇవ్వండి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


mim mla : నమస్తే పెట్టలేదని... ఎమ్మెల్యే కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు.


దేశం, ధర్మం , పార్టీ సిద్ధాంతం కోసం శ్రమించే నిజమైన కార్యకర్తలు బీజేపీలో మాత్రమే ఉన్నారని, ఇది గర్వకారణమని అన్నారు. గతంలో అనేకమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాల కృషి  ఫలితం తోనే బీజేపీ నేడు దేశంలో అధికారంలో ఉందని చెప్పారు. 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు 303 స్థానాలకు ఎదిగిన విషయాన్ని గుర్తు చేస్తూ... ఇదంతా బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమేనని అన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన పార్టీలన్నీ వారసత్వ, అవినీతి, నియంత పార్టీలుగా చలామణి అవుతున్నాయని, ఆయా పార్టీలకు భిన్నంగా నిత్యం ప్రజల కోసం ఆలోచించే పార్టీ  బీజేపీ మాత్రమే అని ఆయన చెప్పారు. ఈ సంధర్బంగా బీజేపీ ఢిల్లీ పార్టీ, గుజరాత్ పార్టీ అంటూ  టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.  టీఆర్ఎస్ పుట్టింది 2001లో కాని, ఆ పార్టీ పుట్టకముందే 1997లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. పార్లమెంటు లో తెలంగాణా బిల్లుకు మద్దతిచ్చిన పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు..  నిఖార్సైన తెలంగాణా వాదం తో పనిచేస్తున్న బీజేపీపై టీఆర్ ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

CM kcr : జిల్లాల పర్యటనలో సీఎం కేసిఆర్.. ఫలితాల తర్వాత టూర్.


ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనైపోయిందని, ఆ పార్టీకి  కౌంట్ డౌన్ ఎప్పుడో స్టార్ట్ అయిందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగిందన్నారు. దీంతో ఓర్వలేక , జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర వ్యక్తిలా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారమనే లక్ష్య సాధన కోసం కార్యకర్తలు ముందుకు సాగాలని బండి సంజయ్ కోరారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Bandi sanjay, Telangana bjp, Trs

ఉత్తమ కథలు