BJP STATE PRESIDENT BANDI SANJAY FIRES ON CM KCR VRY
Bandi sanjay : సీఎం కుట్రలకు ఢిల్లీ చెక్ పెట్టింది.. కేసిఆర్ పతనం ఆరంభమైంది..
Bandi-Sanjay-Kumar
Bandi sanjay : బీజేపీని అప్రతిష్ట పాలు చేసేందుకు సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సీఎం ఢిళ్లి ఎందుకు వెళ్లాడో అర్థం కావడం లేదని అన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ( Bjp state president Bandi sanjay fires on cm kcr ) ధాన్యం కొనుగోలు పేరుతో రాజకీయం చేసేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారని అన్నారు. ఢిల్లీలో ( Delhi ) జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుని మరోసారి సెంటిమెంట్ ను రెచ్చెగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ( Bandi sanjay ) అయితే కేంద్రం ధాన్యం కొనుగోలుతో పాటు పీఎం అపాయింట్మెంట్పై స్పష్టత ఇవ్వడంతో సీఎం కేసీఆర్ ( cm kcr ) కుట్రలు అమలు కాలేదని ఆయన మండిపడ్డారు..
మరోవైపు టీఆర్ఎస్లో ( TRS ) అంతర్గత కుమ్ములాటలకు తెరలేసిందని ఆయన వెల్లడించారు. ఈ సంధర్భంగా సీఎం సీటు కోసం ప్రగతిభవన్లో కుటుంబ సభ్యుల మధ్య కొట్లాట జరుగుతుందన్నారు. తమను సీఎం ఎప్పుడు చేస్తావని కొడుకు, బిడ్డ, అల్లుడు కేసీఆర్ ను అడుగుతున్నారన్నారని చెప్పారు.. అందుకే ఉన్నన్ని రోజులు తానే సీఎంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నాడన్నారు. సీఎం సీటు కోసం కొడుకు, బిడ్డ, అల్లుడిని రెచ్చగొడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నాడన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎంను ప్రశ్నించే గొంతును బయటకు పంపే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారన, దీనికి ఉదాహరణ ఈటల రాజేందర్ అని అన్నారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో స్థానం లేదనే...రాజేందర్ లాంటి వాళ్లను బయటకు పంపుతున్నారన్నారు.
మరోవైపు తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయిండో అర్ధం కాలేదన్నారు. అపాయిట్ మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ ను రాజేద్దామనుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు రాజకీయ పతనం మొదలైనట్లు తనకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడన్నారు. ప్రజలు చీదరించినా, చీత్కరించినా..బీజేపీని ( Telangana BJP ) నవ్వులపాలు చేయాలనే నీచమైన కుట్రకు కేసీఆర్ పాల్పడ్డారన్నారు. త్వరలోనే తెలంగాణ తల్లికి విముక్తి కాబోతుందని.. బీజేపీతోనే అది సాధ్యం కాబోతుందన్నారు. అందుకోసం రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుందన్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.