Home /News /telangana /

BJP STATE PRESIDENT BANDI SANJAY CHALLENGED CM KCR ON WHETHER HE HAD THE GUTS TO ARREST PEOPLE IF THEY TOLD DETAILS OF PEOPLE SUPPLYING DRUGS IN HYDERABAD PRV

Hyderabad drugs case: డ్రగ్స్​ వ్యవహారంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు .. ఏమన్నారంటే..?

bandi sanjay, KCR (File photo)

bandi sanjay, KCR (File photo)

హైదరాబాద్​ డ్రగ్స్ కేసు (Hyderabad pub drugs)లో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వ తీరుపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

    హైదరాబాద్​ డ్రగ్స్ కేసు (Hyderabad pub drugs)లో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్బు (Radisson blu Pub)పై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు పలువురు ఈ కేసులో పట్టుబడ్డారు. అయితే ఈ వ్యవహారంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వ తీరుపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP state president Bandi Sanjay )విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో సగం డ్రగ్స్ దందా టీఆర్ఎస్ నాయకులదేనని వాళ్ల పేర్లు చెబితే వాళ్లను పట్టుకునే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉందా అని సంజయ్ సవాల్ (challenged CM KCR ) విసిరారు.

    రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ దందాను నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హైదరాబాద్ సిటీ లో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారిలో సగం మంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవే అని, వారి పేర్లను చెబితే వాళ్లను పట్టుకుని జైలుకు పంపుతారా? అని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు.

    ప్రశ్నిస్తే  జైళ్లు అంటున్నారని..

    శ్రీకాంత్ చారి, సుమన్ లాంటి ఎంతోమంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను మద్యం, డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని బండి సంజయ్​ విమర్శించారు. డబల్ బెడ్ రూమ్, వరి ధాన్యం ఇతర సమస్యల విషయంలో ప్రశ్నిస్తే కేసులు,  జైళ్లు అంటున్నారని తనకు జైళ్లు కొత్త కాదని, ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు జైలుకు వెళ్లిన అనుభవం ఉందని, దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లడానికి, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

    కేటీఆర్‌పై పరువునష్టం దావా..

    ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, రాష్ట్రంలోని డ్రగ్స్ దందాకు కేటీఆరే కెప్టెన్ అని నిజామాబాద్ ఎంపీ (nizamabad mp) ధర్మపురి అర్వింద్ (dharmapuri arvind) ఆరోపించారు. కేటీఆర్‌పై పరువునష్టం దావా వేయాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కోరుతున్నా అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పదవుల్లో ఉన్నంతకాలం హైదరాబాద్ 'ఉడ్తా హైదరాబాద్' గా (udta hyderabad) ఉంటుందని అర్వింద్ అభివర్ణించారు.

    వరిధాన్యం (paddy procurement) కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ (trs) నేతలు ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదమని   అన్నారు. ప్రతి గింజా కొంటామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని, రైతులకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేక ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు బోనస్ ఇవ్వలేక కేంద్రంపైకి నెడతారా అంటూ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కనుసన్నల్లోనే రీసైకిల్ బియ్యం దందా నడుస్తోందని అర్వింద్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలను నూకలు తినాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ (piyush goyal) అన్నట్టు డ్రగ్స్ మత్తులో కేటీఆర్ కలగన్నారు అంటూ సెటైర్లు వేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, CM KCR, Drugs case, Hyderabad

    తదుపరి వార్తలు