హోమ్ /వార్తలు /తెలంగాణ /

Palamuru project : సీఎం కేసీఆర్ వైఫల్యమే పాలమూరు- రంగారెడ్డి పై ఎన్జీటి స్టే..

Palamuru project : సీఎం కేసీఆర్ వైఫల్యమే పాలమూరు- రంగారెడ్డి పై ఎన్జీటి స్టే..

Palamuru project : సీఎం కేసీఆర్ వైఫల్యమే పాలమూరు- రంగారెడ్డి పై ఎన్జీటి స్టే..

Palamuru project : సీఎం కేసీఆర్ వైఫల్యమే పాలమూరు- రంగారెడ్డి పై ఎన్జీటి స్టే..

Palamuru project : ఎన్జీటి తీర్పుతో మరోసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఎన్జీటి తీర్పు రావడానికి కారణం సీఎం కేసిఆర్ వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపణలు ఎక్కుపెట్టింది.

  ఎన్జీటి తీర్పుతో మరోసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఎన్జీటి తీర్పు రావడానికి కారణం సీఎం కేసిఆర్ వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపణలు ఎక్కుపెట్టింది.

  పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూడు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేయాలని నేడు ఎన్జీటి తీర్పు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయా దుమారం రేగుతోంది. ఎన్జీటి తీర్పు రావడానికి కారణం సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణమని బీజేపీ నేత డికే ఆరుణ ఆరోపించారు. పాలమూరుపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే స్టే వచ్చిందని ఆమె విమర్శించారు. డీపీఆర్‌లు ఇవ్వకపోవడం, ఎన్జీటీ ముందు బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లనే స్టే వచ్చిందన్నారు. ‘‘ దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని ఈ సంధర్భంగా ఆమె ఆరోపించారు... ముందు నుంచి కృష్ణానదిని పక్క రాష్ట్రానికి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నారని అన్నారు. కృష్ణాను పూర్తిగా దారిమళ్లిపోతే గోదావరిపై మరిన్ని లిఫ్టులు పెట్టి దోచుకోవాలని కేసీఆర్‌ చూస్తున్నారని దుయ్యబట్టారు.. పాలమూరు పనులు ఆగిపోతే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారతాయని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి కమీషన్లు దండుకోవడం తప్ప ప్రాజెక్టులపై చిత్తశుద్ధిలేదని ఆమె ఘటుగా విమర్శించారు.. కేసీఆర్‌ను పాలమూరు రైతులు క్షమించరని డికే అరుణ అన్నారు.

  ఇది చదవండి : హుజూరాబాద్ ఓటర్లకు .ఈసీ షాక్.... డబ్బుల కోసం ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ కేసులు..?


  కాగా నేడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటి స్టే విధించింది. కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఎన్జీటిలో ఫిర్యాదు చేయడంతో విచారించిన ట్రిబ్యునల్ నేడు ఆదేశాలు జారీ చేసింది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: AP Telangana Water Fight, Godavari river, Telangana

  ఉత్తమ కథలు