BJP : బండి సంజయ్ పాదయాత్ర రూట్‌మ్యాప్ ఇదే..

బండి సంజయ్

BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఖారారు కావడంతో అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం పాదయాత్రను విడుతల వారిగా ప్లాన్ చేశారు.ఇందులో భాగంగా మొదటి విడతలో ఆరు జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది.

  • Share this:
    పార్టీని బలోపేతం చేయడంతోపాటు సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మరియు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే తన మొత్తం మీద 55 రోజుల పాటు సుమారు 750 కిలోమీటర్ల మీర సాగనున్న పాదయాత్రలో మొదటి విడతగా ఆరు జిల్లాలను చుట్టి రానున్నారు.

    ఇందులో భాగంగానే 8న హైదరాబాద్ నుండి .....9న నాగర్ కర్నూలు, 10న నిజామాద్, 11న కరీంనగర్
    12న సంగారెడ్డి, 13న భూపాలపల్లి జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపాటు, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో సమస్యలను తెలసుకోవడం లాంటీ ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెట్టనున్నట్టు పార్టీ ప్రకటించింది.

    మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలని బండి నిర్ణయించారు. దీంతో ఇప్పటికే తొలి విడత యాత్ర ఖరారయింది. ఆగస్టు 9న హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మావారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.రోజుకు 15 నుంచి 20 కి.మీ. బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు.

    కానున్న రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణలో అధికారమే పరామవధిగా బీజేపి పావులు కదుపుతోంది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం సైతం రాష్ట్రంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.  మరోవైపు దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం తన సత్తాను చాటింది..అయితే నాగార్జున సాగర్‌లో మాత్రం ఊహించని ఫలితాలను ఎదర్కొంది..దీంతో బీజేపీపై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.

    అయితే.... ఈటల రాజేందర్ రాజీనామా చేయడం బీజేపీకి మరో అవకాశం లభించింది. దీంతో బీజేపీ శ్రేణులకు మరోసారి అవకాశం కలసి వచ్చింది. దీంతో రాష్ట్ర నాయకత్వం మొత్తం కలిసి హుజురాబాద్‌లో పర్యటిస్తోంది. ఎలాగైనా హుజురాబాద్‌లో సీటును కైవసం చేసుకోవాలని కసరత్తు ప్రారంభించింది. సాధరణ ఎన్నికలకు ముందే పార్టీ బలోపేతం చేసి ఎలాగైనా టీఆర్ఎస్ ను ఢీ కొట్టాలనే యోచనలో పార్టీ ఉంది..దీంతో ఎన్నికల సమయం వరకు పాదయాత్రతోపాటు నిత్యం ప్రజల్లో ఉండేందుకే బీజేపీ నాయకత్వం మొగ్గుచూపుతోంది.
    Published by:yveerash yveerash
    First published: