హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: అదే జరిగితే.. టీఆర్ఎస్‌కు మరోసారి ‘తీన్మార్’.. సరికొత్త ప్లాన్

Telangana: అదే జరిగితే.. టీఆర్ఎస్‌కు మరోసారి ‘తీన్మార్’.. సరికొత్త ప్లాన్

తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫోటో)

తీన్మార్ మల్లన్న (ఫైల్ ఫోటో)

Teenmaar Mallanna: టీఆర్ఎస్ వ్యతిరేక విధానంతో ప్రజల్లోకి వెళ్లి గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న.. నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

  పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన తీన్మార్ మల్లన్న.. టీఆర్ఎస్‌ను ఎంతగానో టెన్షన్ పెట్టాడు. ఆ పార్టీని ఓడించినంత పని చేసిన తీన్మార్ మల్లన్న భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఏంటన్నది రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్’గా మారింది. తనకు వచ్చిన రాజకీయ గుర్తింపును ఏ రకంగా కొనసాగించాలనే దానిపై ఆయన కూడా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ వ్యతిరేక విధానంతో ప్రజల్లోకి వెళ్లి గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న.. నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తరువాత ఈ అంశంపై మల్లన్న స్పందించారు. దీనిపై తమ టీమ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

  అయితే నాగార్జునసాగర్‌లో మల్లన్న పోటీ విషయంలో ఇప్పుడు సరికొత్త టాక్ వినిపిస్తోంది. ఆయనను తమ పార్టీలో చేర్చుకుని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో ఉంచాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బలంగా లేకుండా టీఆర్ఎస్‌ను బలంగా ఢీ కొట్టిన తీన్మార్ మల్లన్న బీజేపీకి తోడైతే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సులువు అవుతుందని ఆ పార్టీ నేతలు కొందరు యోచిస్తున్నట్టు సమాచారం.

  తీన్మార్ మల్లన్నకు సన్నిహితంగా ఉండే మాజీ ఎంపీ ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. ఆయన ద్వారా బీజేపీ ఈ విషయంలో మల్లన్నతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సుముఖంగానే ఉన్న తీన్మార్ మల్లన్న.. బీజేపీలో చేరే విషయంలో మాత్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాడిన తీన్మార్ మల్లన్న బీజేపీ తరపున సాగర్ ఎన్నికల బరిలోకి దిగితే.. అక్కడ కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Nagarjuna Sagar By-election, Trs

  ఉత్తమ కథలు