Home /News /telangana /

BJP NATIONAL EXECUTIVE MEETING 2022 BJP WILL DEFINITELY WIN UPCOMING ASSEMBLY ELECTIONS SAYS AMIT SHAH SK

Telangana | BJP: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. హోంమంత్రి అమిత్ షా ధీమా

అమిత్​ షా (ఫైల్​ ఫొటో)

అమిత్​ షా (ఫైల్​ ఫొటో)

BJP Hyderabad Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం.. తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమావ్యక్తం చేశారు.

    హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National Executive Meeting) రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నా.. రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని తప్పుబట్టుతున్నారని విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా సంక్షోభం, సర్జికల్ స్ట్రైక్స్‌, రాహుల్ గాంధీ ఈడీ విచారణ విషయంలో కూడా ప్రతికూల రాజకీయాలు చేశారని విరుచుకుపడ్డారు అమిత్ షా. కాశ్మీర్ అంశాన్ని (Kashmir Issue) అంతర్జాతీయంగా మార్చే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ (Telangana)పైనా కీలక వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్‌తో పాటు తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    బీజేపీ సమావేశాల్లో కలకలం.. రహస్యంగా ఫొటోలు..స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పనేంటి?

    ఇక, రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ నేతలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు ప్రధాని మోదీ. రాజకీయ తీర్మానంలో చాలా అంశాల ప్రస్తావించారు. మార్పులను చేర్పులను కూడా సూచించారు. ఈ వివరాలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాకు వివరించారు. దేశంలో మరో 30-40 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ప్రకటన ఉంటుందని తెలిపారు. తెలంగాణలో రాష్ట్రలో కుటుంబ పాలన, జరుగుతున్న అరాచకాల గురించి కూడా సమావేశంలో చర్చ జరిగిందని హిమంతబిశ్వ శర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు, జాలి, కులమత ప్రాంత వాదాలను నిరోధించాల్సిన అవసరం ఉందని అమిత్ షా చెప్పినట్లు ఆయన తెలిపారు. త్వరలో తెలంగాణలో కూడా కుటుంబ పాలన అంతమవుతుందని స్పష్టం చేశారు హిమంత బిశ్వ శర్మ.



    మరోవైపు కార్యవర్గ సమావేశాల్లో ప్రసంగించే అవకాశం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లభించింది. 15 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. తెలంగాణ ఉద్యమ ఎలా మొదలైంది? ప్రజల్లో సెంటిమెంట్ ఎలా ఉంది? టీఆర్ఎస్ ఏం చేసింది? మిగతా పార్టీల పాత్ర ఏంటి? అని చక్కగా వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనగలిగే పార్టీ.. బీజేపీయేనని ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు. కేంద్ర నాయకత్వం నుంచి కొంత భరోసా, నమ్మకం ఇస్తే.. ప్రజలు బీజేపీ వెంట ఉంటారని అన్నారు. దానికి ఉపఎన్నికలే ఉదాహరణే అని చెప్పారు. ఆయన ప్రసంగాన్ని జాతీయ నేతలంతా ఆసక్తగా ఉన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత.. ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రసంగానికి ముందు ఈటలతో జేపీ నడ్డా, అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీ బలాబలాలపై వారికి ఈటల వివరించినట్లు తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amit Shah, Bjp, BJP National Executive Meeting 2022, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు