Home /News /telangana /

BJP NATIONAL EXECUTIVE MEETING 2022 BJP RELEASED STATEMENT ON TELANGANA STATE SLAMS TRS GOVT SK

BJP Meeting: బీజేపీ సమావేశాల్లో తెలంగాణపై స్టేట్‌మెంట్.. అందులో ఏముంది? పూర్తి వివరాలు

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా

BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ మాట్లాడారు. వారి ప్రసంగాలను జాతీయ నేతలు ఆసక్తిగా విన్నారు.

    తెలంగాణ ఏర్పాటై ఎనిమిదేళ్లు గడిచినా.. ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (BJP National Executive Meeting) బీజేపీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. మొత్తం ఏడు పేజీలతో తెలంగాణ (Telangana)కు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను ప్రకటించింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పట్ల... రాష్ట్ర ప్రజలు  నిరాశతో ఉన్నారని అందులో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించిందని .. ప్రత్యేక రాష్ట్రలో బీజేపీ పాత్ర కీలకమైనదని తెలిపింది. తెలంగాణ ఉద్యమం మొదలు రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన హామీల అమలో కేసీఆర్ సర్కార్ (CM KCR) విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో.. అభివృద్ధిలో దూసుకెళ్తుందని తెలిపింది బీజేపీ.

    రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉంటే..టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కి పడుతుంది:జగ్గారెడ్డి

    స్టేట్‌మెంట్‌లో ముఖ్యాంశాలు:
    కేంద్ర పథకాలను అమలు చేయకుండా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. అందువల్ల తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివద్ధిలో దూసుకెళ్తుంది.

    ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వి విఫలమైంది. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌పై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది. తెలంగాణలో ప్రధాని మోదీకి ఆదరణ పెరుగుతోంది.

    BJP: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. హోంమంత్రి అమిత్ షా ధీమా

    తెలంగాణలో టీఆర్ఎస్ నేత‌ృత్వంలోని అవినీతి, వారసత్వ ప్రభుత్వం గద్దె దిగాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీయే ప్రత్యామ్నాయమని బలంగా విశ్వసిస్తున్నారు.

    తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో.. రెండు చోట్లా బీజేపీ ఉంటే.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకెళ్తుంది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎరగడం ఖాయం.



    ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ మాట్లాడారు. వారి ప్రసంగాలను జాతీయ నేతలు ఆసక్తిగా విన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ఎలా మొదలైంది? ప్రజల్లో సెంటిమెంట్ ఎలా ఉంది? టీఆర్ఎస్ ఏం చేసింది? మిగతా పార్టీల పాత్ర ఏంటి? అని ఈటల రాజేందర్ చక్కగా వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనగలిగే పార్టీ.. బీజేపీయేనని ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు. కేంద్ర నాయకత్వం నుంచి కొంత భరోసా, నమ్మకం ఇస్తే.. ప్రజలు బీజేపీ వెంట ఉంటారని అన్నారు. దానికి ఉపఎన్నికలే ఉదాహరణే అని చెప్పారు. ఆయన ప్రసంగాన్ని జాతీయ నేతలంతా ఆసక్తగా ఉన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత.. ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రసంగానికి ముందు ఈటలతో జేపీ నడ్డా, అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీ బలాబలాలపై వారికి ఈటల వివరించినట్లు తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amit Shah, Bjp, BJP National Executive Meeting 2022, Hyderabad, PM Narendra Modi, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు