తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ప్రయత్నిస్తున్నారని చేసిన కామెంట్స్ తో ఈ చిచ్చు రేగినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్ చేసిన కవిత తాను పార్టీలో చేరతానని చెప్పారని ఎంపీ అర్వింద్ నిన్న కామెంట్స్ చేశారు. దీనితో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు.
ఇక తాజాగా అరవింద్ వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత (MLC Kavita) ఘాటుగా స్పందించారు. తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పు తీసి కొడతా..పట్టుకుని తంతా అని అరవింద్ ను కవిత (MLC Kavita) హెచ్చరించారు. ఎంత మాట్లాడితే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకోము. రాజకీయాలు చెయ్ కానీ పిచ్చి వేషాలు వేయకని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అరవింద్ ఎక్కడి నుండి పోటీ చేసినా అక్కడి నుండే ఓడించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.అంతేకాదు తనను బీజేపీలో చేరమని అడిగారని కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. అందుకోసం బీజేపీ అనుబంధ సంస్థలు నన్ను సంప్రదించారని ఆమె తెలిపారు. షిండే మోడల్లో ఈ ప్రతిపాదన తెచ్చారన్నారు. కానీ మేము డైరెక్ట్ గానే ఎదుగుతాం. బ్యాక్ డోర్ ద్వారా కాదని కవిత (MLC Kavita) చెప్పుకొచ్చారు. మేము ప్రజల్లోనే ఉంటాం. దైర్యంగా ఎదుర్కొంటాం అని ఆమె అన్నారు.
Telangana: Nizamabad BJP MP Dharmapuri Aravind has alleged that his vehicle was attacked by TRS workers in Warangal today. He said, "It’s a shame on CM&DGP for bringing down order of the state to chaos,where a people’s representative is attacked and chased in the broad daylight." pic.twitter.com/pDgmFBbnKo
— ANI (@ANI) July 12, 2020
కాగా ఇటీవల కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమావేశంలో ఈ అంశం బయటపెట్టారు. తన బిడ్డ ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీలో చేరమని అడిగారు. ఇంత ఘోరం ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. మరోవైపు అర్వింద్ ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) అరవింద్ కు ఫోన్ చేశారు. దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొలేకే ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Dharmapuri Arvind, Kalvakuntla Kavitha, Nizamabad, Telangana, Trs