హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget :15 నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్.. బయటకు వెళ్లండంటూ స్పీకర్ ..ఆదేశం..!

Telangana Budget :15 నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్.. బయటకు వెళ్లండంటూ స్పీకర్ ..ఆదేశం..!

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్

Telangana Budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే బడ్జెట్ ప్రసంగాన్ని హరీష్ రావు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ పూర్తి అయ్యె వరకు సస్పెండ్ చేశారు.

  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. బడ్జెట్ ప్రసంగాన్ని జాతీయ గీతం ఆలాపనతో

  ప్రారంభమయిన తర్వాత నేరుగా మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టి ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే

  కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన

  చేశారు. దీంతో వారిని సెషన్ పూర్తయ్యెవరకు సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస యాదవ్

  స్పీకర్‌ను కోరుతూ మోషన్ మూవ్ చేశారు. దీంతో వెంటనే ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్, రఘునందన్

  రావులతో పాటు రాజాసింగ్‌లను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వెంటనే వారిని బయటకు

  వెళ్లాలని ఆదేశించారు.అయితే ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండడంతో వారిని  లో నుంచి మార్షల్ బలవంతంగా తీసుకుని వెళ్లారు.

  అంతకు మందు  బీజేపీ ఎమ్మెల్యేలు .నల్లకండువాలతో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల..  గవర్నర్ బాధ్యతను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. కేసీఆర్ కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు . గవర్నర్ కే మాట్లాడే దిక్కు లేకపోతే సభ్యుల సంగతేందని ప్రశ్నించారు. కేసీఆర్ సభ్యులను కించపరుస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీలో ఎగిరేది బీజేపీ జెండానేనన్నారు. సమైక్యాంంధ్రలో కూడా తెలంగాణ తరపున మాట్లాడేందుకు గంటల తరబడి సమయం ఇచ్చారన్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే బయట మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో బీజేపీ పోరాడుతోందన్నారు.

  అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బడ్జెట్ ప్రారంభమైన పదిహేను నిమిషాలకే వారిపై సస్పెషన్ వేటు వేశారు. దీంతో వారిని మార్షల్ బలవంతంగా బయటకు ఎత్తుకెళ్లారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Telangana Assembly, Telangana Budget 2022

  ఉత్తమ కథలు