హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLA Raja Singh: సుప్రీంకోర్టు గడప తొక్కిన BJP ఎమ్మెల్యే రాజాసింగ్​.. పూర్తి వివరాలివే

MLA Raja Singh: సుప్రీంకోర్టు గడప తొక్కిన BJP ఎమ్మెల్యే రాజాసింగ్​.. పూర్తి వివరాలివే

రాజాసింగ్ (ఫైల్​)

రాజాసింగ్ (ఫైల్​)

స్టాండప్​ కమెడియన్​ మునావర్​ ఫారుఖీ షో విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja singh) వీడియో విడుదల చేయడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఆయన అరెస్టయ్యారు. ఈ వివాదంలో ఇపుడు రాజాసింగ్​ సుప్రీంకు వెళ్లారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజాసింగ్ (Raja Singh).. కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఈ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈయన గురించే చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్‌ (Hyderabad)లో అయితే రచ్చ రచ్చ జరుగుతోంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ (Munawar Faruqui) షో హైదరాబాద్‌లో ఖరారైనప్పటి నుంచి రాజాసింగ్ వార్తల్లో ఉంటున్నారు. హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మునావర్‌ను.. హైదరాబాద్‌ (Hyderabad)లో షో చేయనిచ్చే ప్రసక్తే లేదని రాజాసింగ్ హెచ్చరిస్తూ వచ్చారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య మునావర్ ఫరూఖీ షో ముగించుకొని వెళ్లిపోయారు. ఐతే మునావర్‌ను తిట్టే క్రమంలో.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అప్పటి నుంచి రచ్చ మరింత ముదిరింది. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం, ముస్లిం సంఘాలు ఆందోళనలు చేశాయి. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.


  మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు పాత కేసులను దృష్టిలో వుంచుకుని గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్ పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించారు. తనపై అక్రమంగా పీడీ యాక్ట్ (PD Act) పెట్టారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారని చెబుతున్నారు. పీడీ యాక్ట్ పెట్టడమంటే మామూలు విషయం కాదు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి.. కోర్టులు, తీర్పులతో సంబంధం లేకుండా నేరుగా జైల్లో వేస్తారు. కనీసం ఏడాది పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్‌ పరిస్థితి కూడా అదే..! ఐతే పీడీ యాక్ట్‌ను (PD Act) పోలీసులు నిబంధనల ప్రకారమే నమోదు చేశారా? అనేది తేలాలి. అంతా ఓకే అయితే.. ఆయన జైల్లోనే ఉంటారు. పోలీసులు ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే.. కోర్టు ఆదేశాల మేరకు బయటకు వస్తారు.


  Munugodu: ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన నిర్ణయం.. వివరాలివే


  ఇకపోతే.. రాజాసింగ్ పీడీ యాక్ట్ నమోదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ మేరకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్ రాజాసింగ్‌కు అందజేశారు పోలీసులు. రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయని.. మత ఘర్షణలకు దారి తీసేలా రాజాసింగ్ వ్యాఖ్యలు వున్నాయని పోలీసులు పేర్కొన్నారు. మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్లు వున్నట్లు డాక్యుమెంట్‌లో తెలిపారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో .. పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలోనే ఘర్షణలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు ఆయనకు సూచించారు. అయినప్పటికీ పొలీసుల సూచనలను రాజాసింగ్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, Raja Singh, Supreme Court

  ఉత్తమ కథలు