హోమ్ /వార్తలు /తెలంగాణ /

మా సాంగ్ ట్యూన్ రాజాసింగ్ కాపీ కొట్టారంటూ పాక్ ఆర్మీ ట్వీట్

మా సాంగ్ ట్యూన్ రాజాసింగ్ కాపీ కొట్టారంటూ పాక్ ఆర్మీ ట్వీట్

రాజాసింగ్

రాజాసింగ్

పాకిస్తాన్‌లోని స్థానిక మీడియా కథనం ప్రకారం.. రాజాసింగ్ ‘జిందాబాద్ పాకిస్తాన్’ పాటలోని ట్యూన్‌ను కాపీ కొట్టి దాన్ని ‘జిందాబాద్ హిందుస్తాన్’ అని మార్చారంటూ ప్రచారం చేస్తున్నాయి.

  గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాకిస్తాన్ ట్యూన్‌ను కాపీ కొట్టారంటూ ఆ దేశ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిప్ గఫూర్ ట్వీట్ చేశారు. ‘పాకిస్తాన్ జిందాబాద్’అనే సాంగ్‌ ట్యూన్‌ను కాపీ కొట్టి దాన్ని భారత సైన్యానికి అంకితం ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈనెల 14న శ్రీరామనవమి సందర్భంగా ఓ పాటను రిలీజ్ చేశారు. దాన్ని భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ సాంగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత పాకిస్తాన్ దానిపై స్పందించింది. ఆ సాంగ్ ట్యూన్ పాకిస్తాన్‌ డే సందర్భంగా తమ దేశ మీడియా వింగ్‌ను రిలీజ్ చేసిన సాంగ్‌ను పోలి ఉందని తెలిపింది. పాకిస్తాన్ చెబుతున్న పాటను సాహిర్ అలీ బగ్గా రచించారు.


  పాకిస్తాన్‌లోని స్థానిక మీడియా కథనం ప్రకారం.. రాజాసింగ్ ‘జిందాబాద్ పాకిస్తాన్’ పాటలోని ట్యూన్‌ను కాపీ కొట్టి దాన్ని ‘జిందాబాద్ హిందుస్తాన్’ అని మార్చారంటూ ప్రచారం చేస్తున్నాయి. పైగా దాన్ని భారత సైన్యానికి అంకితం ఇచ్చారని చెబుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య బంధం అసలే అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.


  రాజాసింగ్ పాడిన పాట


  First published:

  Tags: Bjp, Pakistan, Raja Singh

  ఉత్తమ కథలు